దిశ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది.
Disha Movie: దిశ ఎపిసోడ్ అయిన దగ్గర్నుంచి కూడా దీనిపై సినిమా ఎవరో ఒకరు తీస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. చివరికి అదిప్పుడు వర్మ చేతుల్లోనే పడింది. ఈ నేపథ్యంలోనే దిశ నిందితుడు చెన్నకేశవులు భార్యని కలిశాడు.
రెండు నెలల కింద హైదరాబాద్లో జరిగిన అతి నీచమైన ఘటన దిశ రేప్ అండ్ మర్డర్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఎపిసోడ్లో పది రోజులకే నిందితులను కాల్చి చంపేసారు పోలీసులు. ఇందులో మలుపులు లేవు.. ట్విస్టులు లేవు.. రేప్ చేసిన ఒక్క రోజులోనే నిందుతులను పట్టుకున్నారు ఖాకీలు. ఆ తర్వాత విచారణ పూర్తి చేసి.. సీన్ రీ కన్సస్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయారని కాల్చి పడేసారు. అయితే దిశ ఎపిసోడ్ అయిన దగ్గర్నుంచి కూడా దీనిపై సినిమా ఎవరో ఒకరు తీస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. చివరికి అదిప్పుడు వర్మ చేతుల్లోనే పడింది.
ప్రతీకాత్మక చిత్రం
కొందరు వద్దని వారిస్తున్నా.. దిశ కుటుంబం గురించి ఆలోచించండి.. ఇప్పుడు ఆ ఎపిసోడ్ చూపించి సొమ్ము చేసుకుంటావా వర్మ.. అసలు నువ్వు మనిషివేనా అంటూ విమర్శిస్తున్నా కూడా ఆర్జీవీ మాత్రం ఏదీ వినేలా అనిపించడం లేదు.. పట్టించుకునేలా కనిపించడం లేదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీయడానికి ఫిక్సైపోయాడు. అందుకే దిశ నిందుతుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను కలిసాడు వర్మ. ఈ నిందుతుల్లో పెళ్లైన ఒకే ఒక్క కుర్రాడు చెన్నకేశవులు. దాంతో అప్పుడేం జరిగింది.. దాని ముందు తర్వాత పరిస్థితులేంటో తెలుసుకోడానికి ఇప్పుడు ఆమెను కలిసాడు ఆర్జీవీ.
I WILL BE INTERVIEWING THE BRUTAL RAPIST CHENNAKESHAVLU ‘s WIFE RENUKA AT 9 PM TONITE ON TV 5 ..Will also be revealing all my intentions behind making DISHA into a film #DishaRenuka@tv5newsnow
వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడంలో వర్మను మించిన వాళ్లైతే ఇండియాలో లేరు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై ఆయన దిశ పేరుతోనే సినిమా చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే దిశ నిందితుడు చెన్నకేశవులు భార్యని కలిశాడు. ఈ విషయాన్ని వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే అప్పట్నుంచి కూడా ఈయన ఆమెతో ఏం మాట్లాడి ఉంటాడు.. అసలు బాధితురాలి కుటుంబాన్ని కాకుండా నిందితుల కుటుంబంతో మాట్లాడటం వెనక అంతరార్థం ఏంటని తలలు పట్టుకుంటున్నారంతా. అయితే వర్మ కోణం మాత్రం వేరు. అక్కడ తప్పు చేసింది చెన్నకేశవులు కానీ ఆయన భార్య కాదంటున్నాడు వర్మ.
Just met Renuka , Rapist Chenna keshavlu’s wife ..She married him at 16 and she’s about to deliver his baby at 17 ..Not only Disha, the bastard made his own wife a victim too ..she is a child giving birth to a child and both have no future pic.twitter.com/zcVwL1p1Bu
16 ఏళ్ల వయసులో ఆమెను చెన్నకేశవులు పెళ్లి చేసుకున్నాడు.. అతడి బిడ్డకు ఆమె 17 ఏళ్ల వయసులో జన్మనివ్వనుంది.. దిశ జీవితాన్నే కాదు అతడు తన భార్యను కూడా బాధితురాలిగా చేశాడంటూ పోస్ట్ చేసాడు వర్మ. ఒక చిన్నారి అయ్యుండి ఆమె మరో చిన్నారికి జన్మనివ్వబోతుందిప్పుడు.. వాళ్లిద్దరికీ ఇప్పుడు మంచి భవిష్యత్తు లేదని తెలిపాడు వర్మ. ఆమెతో దిశ ఘటనకు ముందు ఏం జరిగింది.. చెన్నకేశవులు ఎలాంటి వాడు.. ఊళ్లో ఎలా ఉండేవాడు ఇలా చాలా విషయాల గురించి ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఇవన్నీ తన సినిమాలో పెడతాడేమో మరి..? మరోవైపు దిశ కుటుంబాన్ని కూడా వర్మ కలుస్తాడని ప్రచారం జరుగుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.