వర్మ టార్గెట్ చంద్రబాబు ఒక్కడేనా.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లక్ష్యం అదేనా..?

వ‌ర్మ సినిమా అంటే ఇప్పుడు పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఈయ‌న నుంచి స‌రైన సినిమా వ‌చ్చి కొన్నేళ్లు అయిపోయింది. వ‌ర‌స ఫ్లాపులు ఇస్తున్నాడు క‌దా అని ఆయ‌న్ని త‌క్కువ‌గా మాత్రం అంచ‌నా వేయ‌కూడ‌దు. ఇప్పుడు ఈయన తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇప్పుడు సంచలనాలకు తెరతీస్తుంది. ఇందులో ఏముంటుందనే ఆసక్తి రేకెత్తిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 18, 2019, 6:25 PM IST
వర్మ టార్గెట్ చంద్రబాబు ఒక్కడేనా.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లక్ష్యం అదేనా..?
వర్మ ఎన్టీఆర్ బయోపిక్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 18, 2019, 6:25 PM IST
వ‌ర్మ సినిమా అంటే ఇప్పుడు పెద్ద‌గా సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఈయ‌న నుంచి స‌రైన సినిమా వ‌చ్చి కొన్నేళ్లు అయిపోయింది. వ‌ర‌స ఫ్లాపులు ఇస్తున్నాడు క‌దా అని ఆయ‌న్ని త‌క్కువ‌గా మాత్రం అంచ‌నా వేయ‌కూడ‌దు. వేస్తే అంత‌కంటే తెలివి త‌క్కువ త‌నం మ‌రోటి ఉండ‌దు. ఎందుకంటే ఆయ‌న మ‌న‌సు పెడితే ‘ర‌క్త‌చ‌రిత్ర‌’, ‘అటాక్స్ 26/11’, ‘కిల్లింగ్ వీరప్పన్’ లాంటి సినిమాలు వస్తాయి. ‘వంగవీటి’ కూడా చాలా మందికి నచ్చింది. ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాడు.

Ram Gopal Varma main focus on Chandrababu Naidu in Lakshmis NTR Movie.. వ‌ర్మ సినిమా అంటే ఇప్పుడు పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఈయ‌న నుంచి స‌రైన సినిమా వ‌చ్చి కొన్నేళ్లు అయిపోయింది. వ‌ర‌స ఫ్లాపులు ఇస్తున్నాడు క‌దా అని ఆయ‌న్ని త‌క్కువ‌గా మాత్రం అంచ‌నా వేయ‌కూడ‌దు. ఇప్పుడు ఈయన తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇప్పుడు సంచలనాలకు తెరతీస్తుంది. ఇందులో ఏముంటుందనే ఆసక్తి రేకెత్తిస్తుంది. ntr biopic,Lakshmi's Ntr ntr biopic,varma Lakshmi's Ntr,rgv Lakshmi's Ntr,Lakshmi's Ntr kathanayakudu,krish vs ram gopal varma,Lakshmi's Ntr ntr mahanayakudu,telugu cinema,వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్,క్రిష్ రామ్ గోపాల్ వర్మ,వర్మ క్రిష్,ఎన్టీఆర్ బయోపిక్,తెలుగు సినిమా,ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్
బాలకృష్ణ, ఆర్జీవి


ఏదో అల‌వాటుగా అనౌన్స్ చేసి ఆ త‌ర్వాత మ‌రిచిపోతాడులే అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు కావాల‌నే ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు పోటీగా వ‌స్తున్నాడు వ‌ర్మ‌. ఎంతమంది ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నా కూడా పెద్దాయ‌న‌ అస‌లైన ఆశీర్వాదాలు మాత్రం త‌న సినిమాకే ఉంటాయ‌ని ధీమాగా చెబుతున్నాడు వ‌ర్మ‌. ఇదంతా చూస్తుంటే బాల‌య్య‌ను గిల్లుతున్నాడేమో అనిపిస్తుంది. లేకపోతే ఇన్నాళ్లూ కామ్‌గా ఉండి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ గురించి నోరు విప్పడం ఏంటో..? పైగా ఎన్టీఆర్ వర్ధంతి రోజు తన సినిమా ప్రమోషన్ మరింత పెంచేస్తున్నాడు ఈ దర్శకుడు.


Loading...
క్రిష్ చేస్తున్న బ‌యోపిక్ ల‌క్ష్మీపార్వ‌తి రాక‌తో ముగిసిపోతుంద‌ని.. కానీ త‌న ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ ఆమె రాక‌తోనే మొద‌ల‌వుతుంద‌ని చెబుతున్నాడు వ‌ర్మ‌. ఇప్ప‌టికీ ఇదే మాట మీదున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. త‌ను తెర‌కెక్కిస్తున్న‌ బ‌యోపిక్ లో ఎలాంటి అబ‌ద్ధాలు ఉండ‌వ‌ని.. ఎలాంటి రాజ‌కీయ పార్టీల ఎజెండా ఉండ‌ద‌ని.. ఎవ‌రూ త‌న‌ను ఒత్తిడి చేయ‌డం లేద‌ని చెప్పాడు వ‌ర్మ‌. క్రిష్ ‘క‌థానాయ‌కుడు’ భారీ ఫ్లాప్ కావడంతో ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. జ‌న‌వ‌రి 25న ఇది విడుద‌ల కానుంద‌ని చెప్పాడు వ‌ర్మ‌. అయితే అసలు ఈ చిత్ర షూటింగ్ జరుగుతుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు అభిమానుల్లో వస్తున్నాయి.దాంతో పోలిక‌లు వ‌ద్ద‌న్నా కూడా వ‌స్తాయి. ఇక త‌న వెన్నుపోటు పాట‌లో కూడా కావాల‌నే ప‌దే ప‌దే చంద్ర‌బాబునాయుడు బొమ్మ చూపించాడు వ‌ర్మ‌. ల‌క్ష్మీపార్వ‌తి ఇంటిలో ప‌ని చేసిన ప‌నివాళ్ల నుంచి.. ఆఫీస‌ర్స్.. రాజ‌కీయ నాయ‌కులు.. ఆమె శ‌త్రువుల‌ను కూడా ఇంట‌ర్వ్యూ చేసిన త‌ర్వాత నిజాలు చూపిస్తున్నాన‌ని చెప్పాడు వ‌ర్మ‌. ఇదంతా చూస్తుంటే క‌చ్చితంగా ఏదో సంచ‌ల‌నం అయితే సృష్టించేలా క‌నిపిస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు క్రిష్ వ‌ర్సెస్ వ‌ర్మ వార్ బాగానే జ‌రుగుతుంది. మ‌రి ఇందులో ఎవ‌రు పై చేయి సాధిస్తారో చూడాలి.

దీపిక పదుకొనే ఫోటోస్..


First published: January 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...