Home /News /movies /

RAM GOPAL VARMA LESBIAN LOVE STORY MAA ISHTAM MOVIE WILL RELEASE ON APRIL 8TH SB

Maa ishtam: ఇద్దరు అమ్మాయిల మధ్య రొమాన్స్.. లెస్బియన్ లవ్ స్టోరీతో వస్తున్న వర్మ

హీరోయిన్లతో రామ్ గోపాల్ వర్మ ( ట్విట్టర్ ఫోటో)

హీరోయిన్లతో రామ్ గోపాల్ వర్మ ( ట్విట్టర్ ఫోటో)

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అప్సర రాణితో పాటు నైనా గంగూలి యాక్ట్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య వర్మ రోమాన్స్ పాటను కూడా షూట్ చేశారు.

    వివాదాస్పద, సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. ఈ సారి ఆయన ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం పేరు మా ఇష్టం. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే టాలీవుడ్‌‌లోనే తొలిసారిగా ఇద్దరమ్మాయిల లవ్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ. దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన చిత్ర బృందం ఇప్పుడు హైదరాబాద్ లో తాజాగా ప్రెస్ మీట్ పెట్టింది. రామ్ గోపాల్ వర్మ తో పాటు అప్సర రాణి, నైనా గంగూలీ, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ లు పాల్గొన్నారు.

    ఈ సినిమాలో నేను చేసిన లెస్బియాన్ రోల్ ఎంతో డిఫరెంట్ గా ఉందని చెప్పింది హీరోయిన్ నైనా గంగూలి. హీరో పక్కన నటించడం చాలా ఈజీ.. కానీ ఒక అమ్మాయితో రొమాన్స్ సీన్స్ లో నటించడం ఎంతో డిఫికల్ట్ అంది. ఈ సినిమా మొదట్లో ఇబ్బంది పడ్డాను కానీ తర్వాత అందరి సప్పోర్ట్ తో బాగా చేయగలిగాను. ఒక నటి ఎలాంటి పాత్ర అయినా బాగా చేయాలనీ నమ్ముతానని నైనా చెప్పింది. అందుకే ఇది పూర్తి చేయగలిగాను. ఈ సినిమా చేయడాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనంది. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతారంది నైనా. ఈ సినిమా కథ వినగానే చేయాలనిపించిందని చెప్పింది అప్పర రాణి. ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడితే ఏంటి అనేది ఈ సినిమా. వర్మ తీసిన సినిమాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రం కూడా ఎవరు ఊహించని విధంగా ఉంటుందని చెప్పింది అప్పర రాణి. రొమాంటిక్ పాట లో చేయడం ఎంతో థ్రిల్ అనిపించిందని చెప్పింది. వెరైటీ పాత్రలు చేయాలన్నదే తన లక్ష్యమంది.

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. మా ఇష్టం సినిమా ఒక క్రైమ్ డ్రామా మూవీ. అందులో లీడ్ పెయిర్ లెస్బియన్స్. ఆ పాత్రలలో నైనా గంగూలీ, అప్సర రాణి ఇద్దరు అద్భుతంగా నటించారు. అప్సర నటించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు కానీ నైనా ని ఒప్పించడానికి కొంత సమయం పట్టింది. ఇద్దరు కూడా వారి పేరెంట్స్ తో మాట్లాడి ఈ సినిమా చేశారు. వరల్డ్ లోనే ఇద్దరు అమ్మాయిలతో రొమాంటిక్ పాట షూట్ చేయడం జరగలేదు. ఏప్రిల్ 8 న వస్తున్న ఈ సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయాలన్నారు. వర్మతో పనిచేస్తే కిక్ వస్తుందన్నారు నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలున్నారు. మా సినిమా లో ఇద్దరు కత్తిలాంటి హీరోయిన్ లు, అర్జీవి గారు ఉన్నారు. ఈ సినిమా తప్పకుండా యాభై కోట్లు కలెక్షన్స్ సాధిస్తుందన్నారు ప్రొడ్యూసర్.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Ram Gopal Varma, Ram Gopal Varma Apsara Rani, Tolllywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు