ఈసారి వర్మ గట్టిగానే కొట్టేటట్టే ఉన్నాడుగా..

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమాలో విషయం ఎలా ఉన్నా.. సినిమా పేరు, టీజర్, ట్రైలర్, ప్రోమో సాంగ్స్ వంటి అంశాలతో పావులా ఖర్చు లేకుండా సినీ ప్రపంచాన్ని ఒకసారి తనవైపుకు తిప్పుకుంటాడు.

news18-telugu
Updated: November 12, 2019, 7:49 AM IST
ఈసారి వర్మ గట్టిగానే కొట్టేటట్టే ఉన్నాడుగా..
Twitter
  • Share this:
సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమాలో విషయం ఎలా ఉన్నా.. సినిమా పేరు, టీజర్, ట్రైలర్, ప్రోమో సాంగ్స్ అంశాలతో పావులా ఖర్చు లేకుండా సినీ ప్రపంచాన్ని ఒకసారి తనవైపుకు తిప్పుకుంటాడు. ఆయన ఇలాంటి స్టంట్స్ ఇంతకు ముందు చేశాడు. చేస్తూనే ఉన్నాడు. అందుకు నిదర్శనమే ఆయన గతంలో తీసిన రెండు సినిమాలు ఉదాహరణగా చెప్పోచ్చు. నాగార్జున ‘ఆఫీసర్, ఇటీవల వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్’. కేవలం సినిమా పేరు వివాదస్పదంగా పెట్టడం.. జనాల్నీ ఆకర్షించడం ఆయన స్ట్రాటజీ. అయితే ఇవి పబ్లిసిటికి పనికి వస్తున్నాయి కానీ, సినిమాలో కంటెంట్ లేక బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంటున్నాయి. కాగా వీటి తరహాలోనే ప్రస్తుతం అయన చేస్తున్న కొత్త చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ వస్తోంది.


ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమకాలీన రాజకీయ పరిణామాలను ఆధారంగా తీసుకొని చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు సామాజిక వర్గాల కోణం కూడా తోడవ్వడంతో తెలుగు ప్రేక్షకుల్లో తెగ ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి వర్మ కాస్తా కంటెంట్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు టీజర్, ట్రైలర్, విడుదలైన సాంగ్స్‌ను బట్టి తెలుస్తోంది. సినిమాలో ఏమాత్రం ప్రేక్షకుల్నీ అలరించే మేటర్ ఉన్న మంచి విజయాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాకు ఇప్పటికే అదిరిపోయే ప్రచారం వచ్చింది. చూడాలి మరి.. వర్మ ఎప్పటిలాగే కేవలం పబ్లిసిటినే నమ్మకున్నాడా లేదా మంచి కంటెంట్‌తో అదరగొట్టనున్నాడా.. అని తెలియాలంటే మాత్రం ఈ నెల 29 వరకు వేచి చూడాల్సిందే.

బ్లూ లెహంగాలో అదిరిన నభా నటేష్
First published: November 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...