‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ టాక్.. మోడీ, అమిత్ షా‌‌లను కూడా వదల్లేదుగా..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  అంటేనే సంచలనం. ఆయన ఏమి చేసినా ఒక సెన్సేషనే. తాజాగా ఈయన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో వస్తున్నాడు. టైటిల్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసాడు.

news18-telugu
Updated: October 27, 2019, 10:00 AM IST
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ టాక్.. మోడీ, అమిత్ షా‌‌లను కూడా వదల్లేదుగా..
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ప్రధాని మోదీ, అమిత్ షా(Youtube/Photo)
  • Share this:
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  అంటేనే సంచలనం. ఆయన ఏమి చేసినా ఒక సెన్సేషనే.  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తెలుగు రాజకీయాన్ని నాటకీయంగా మార్చిన వర్మ.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మరో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్, లోకేష్ సహా పలు పాత్రలకు సంబంధించిన లుక్స్‌ విడుదల చేసి ఈసినిమాపై అంచనాలు పెంచేసాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసాడు.ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం తర్వాత ఏర్పడిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనపడుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో జగన్ సీఎం కావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోవడాన్ని ఈ సినిమాలో ప్రస్తావించాడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా టీడీపీకి కంచుకోట అయిన విజయవాడను కమ్మరాజ్యంగా అభివర్ణించాడు.  విజయవాడ నుంచి కడపరెడ్లు (వైయస్ జగన్) పాలన చేయడాన్ని ఈ సినిమాలో చూపించాడు. అంటే కమ్మ రాజ్యంలో కడపరెడ్లు ఎంటరైనట్టు చూపించాడు. ముందు నుంచి తెలుగు దేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేతపై ఒంటికాలుపై లేచే రామ్ గోపాల్ వర్మ.. తాజాగా తన ట్రైలర్‌లో వన్ సైడ్‌గా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల తీరును తన ట్రైలర్‌లో ఎండ గట్టాడు. చివర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ తతంగం చూస్తున్నట్టు చూపించాడు. మొత్తనానికి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో కావాల్సినంద కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

First published: October 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>