‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎపుడంటే..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  అంటేనే సంచలనం. తాజాగా ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించారు.

news18-telugu
Updated: November 10, 2019, 5:45 PM IST
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎపుడంటే..
‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ మూవీ స్టిల్
news18-telugu
Updated: November 10, 2019, 5:45 PM IST
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  అంటేనే సంచలనం. ఆయన ఏమి చేసినా ఒక సెన్సేషనే.  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తెలుగు రాజకీయాన్ని నాటకీయంగా మార్చిన వర్మ.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మరో సినిమా‌తో వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ఈ సినిమాలో పప్పులాంటి అబ్బాయి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాను టైటర్ కంపెనీ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై తెరకెక్కించాడు. ఈ సినిమాను సిద్ధార్ధ తాతోలు డైరెక్ట్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రాజకీయ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సంధించిన మరో కమర్షియల్ అస్త్రంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ కూడా ఒక క్యారెక్టర్ చేస్తుండటం విశేషం. ఎన్నో అంచనాల మధ్య రిలీజైతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...