• HOME
 • »
 • NEWS
 • »
 • MOVIES
 • »
 • RAM GOPAL VARMA HUMOR TWEET ON CORONA VIRUS CURFEW GOES VIRAL ON INTERNET NR

Ram Gopal Varma: కరోనా కర్ఫ్యూ పై ఆర్జీవీ సెటైర్లు.. వెక్కిలి నవ్వు!

Ram Gopal Varma: కరోనా కర్ఫ్యూ పై ఆర్జీవీ సెటైర్లు.. వెక్కిలి నవ్వు!

ram gopal varma

Ram Gopal Varma: ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకి కేసుల సంఖ్య లక్షలలో పెరుగుతుండగా.. ప్రజల్లో మళ్లీ భయాందోళన ఎదురవుతుంది

 • Share this:
  Ram Gopal Varma: ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకి కేసుల సంఖ్య లక్షలలో పెరుగుతుండగా.. ప్రజల్లో మళ్లీ భయాందోళన ఎదురవుతుంది. ఇప్పటికే పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా వైరస్ విజృంభణ తీవ్రత ఎక్కువగా వ్యాపించింది. పలుచోట్ల కరోనా వ్యాక్సిన్ టీకాలు అందించగా.. చాలా వరకు టీకాలు తీసుకోవడానికి భయపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దీని తీవ్రత ఎక్కువగా ఉండటంతో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం పై ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

  ప్రస్తుతం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. మహారాష్ట్రలో అక్కడ ఉన్న కొన్ని రంగాలను బంద్ చేయగా.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాలు, సినిమా థియేటర్లు, షూటింగులు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వంటి పలు వాటిపై బంద్ ప్రకటించగా.. ఇంత తీవ్రంగా ఉన్నా ఈ పరిస్థితిలో ఉత్తరప్రదేశ్ లో కుంభమేళ ఏకంగా ఆరు లక్షల మంది ఒకే చోట చేరి గంగ స్నానాలు చేయడం భారీ ఎత్తుగా నిర్వహిస్తున్నారు. ఈ విషయం గురించి ఎన్నో విమర్శలు ఎదురవగా.. తాజాగా ఆర్జీవీ కూడా విమర్శించాడు.  ప్రముఖ తెలుగు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.." ఎగ్జామ్స్ ఆపేశారు, వ్యాపారాలు, థియేటర్లు మూసేశారు. మొత్తం పనులన్నీ నిలిపివేశారు. ఎందుకంటే.. కరోనా కోసం కాదు, జనాలంతా కుంభమేళకు వెళ్లడానికి, రాజకీయ ప్రదర్శనల్లో పాల్గొనడానికి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది అంటూ కామెంట్ చేశాడు. అంతేకాకుండా ఇంత మంచి పని చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ" సెటైర్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
  Published by:Navya Reddy
  First published: