Home /News /movies /

RAM GOPAL VARMA GOT ANOTHER GREAT INSULT DUE TO HIS LATEST FILM ISSUE TA

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మకు మరో ఘోర అవమానం.. ఈ సారి అంతకు మించి..

రామ్ గోపాల్ వర్మ (ప్రతీకాత్మకచిత్రం)

రామ్ గోపాల్ వర్మ (ప్రతీకాత్మకచిత్రం)

RGV  - Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కు ఘోర అవమానం జరిగింది. వివరాల్లోకి వెళితే..

  RGV  - Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కు ఘోర అవమానం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా ఆర్జీవి తన చేతలతో వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు.  వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నట్టే అర్ధం.తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చుకోవాలి. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన ఈయన ఇపుడు రొటిన్ చెత్త సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కరోనా టైమ్‌లో వర్మ.. కొన్ని సినిమాలు తెరకెక్కించి ఏటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసి మంచిగనే సంపాదించుకున్నారు. తాజాగా ఈయన ’డేంజరస్’ అంటూ ఓ సినిమా తెరకెక్కించారు.

  నైనా గంగూలి, అప్సర రాణి  ముఖ్యపాత్రల్లో లెస్బియన్ కథాంశంతో తెరకెక్కించిన ఈ మూవీని ఈ నెల 8న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ థియేటర్స్ మరియు మల్టీప్లెక్స్ కు సంబంధించిన యాజమాన్యం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘డేంజరస్’ వంటి వివాదాస్పద చిత్రాన్నిథియేటర్స్‌లో  ప్రదర్శించబోమంటూ తెగేసి చెప్పాారు. మొత్తంగా ఒకప్పడు తన సినిమాలతో దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్న ఈ దిగ్జర్శకుడికి ఇంత కంటే అవమానం మరొకటి ఉండంటున్నారు ప్రేక్షకులు. దీన్ని కూడా తన సినిమాకు పబ్లిసిటీ స్టంట్‌గా ఉపయోగించుకునే తుంటరి రామ్ గోపాల్ వర్మ.  మొత్తంగా థియేటర్స్ యాజమాన్యం తన సినిమాను తిరస్కరిస్త.. ఓటీటీ లేదా నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసినా చేసే రకం రామ్ గోపాల్ వర్మ.

  Raghavendra Rao - Rajamouli: రాజమౌళి సహా రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికం చేసిన టాలీవుడ్ టాప్ దర్శకులు వీళ్లే..

  రామ్ గోపాల్ వర్మ .. రీసెంట్‌గా ఈ డేంజరస్ ప్రీ రిలీజ్ వేడుకలతో  తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ మూవీ తీస్తున్నట్టు చెప్పారు.గతంలో కూడా టైగర్ కేసీఆర్ అంటూ  తన మనసులతో మాట బయట పెట్టారు.ఇక పొలిటికల్ బయోపిక్స్‌ను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మను మించిన తోపు దర్శకుడు లేరు. ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్ చిత్రాలకు సంబంధించిన బయోపిక్స్‌ను తీయడంలో వర్మను మించినోడు లేడంటూ ఆయన ప్రత్యర్ధులు అంటుంటారు. గతంలో రామ్ గోపాల్ వర్మ ఏదైనా సంఘటన జరినపుడు దానికి సంబంధించిన చరిత్రను సినిమా తీస్తున్నట్టు ప్రకటించడం ఆయన అలవాటు. అంతేకాదు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇష్టం ఉంటే ఆ సినిమాను తెరకెక్కిస్తారు. లేకపోతే అంతే సంగతులు.

  తెలంగాణ సీఎం కేసీఆర్ పై వర్మ బయోపిక్ (File/Photo)


  ఇక సార్వత్రిక ఎన్నికల ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో  సంచలనం రేపారు. ముందుగా ఈ సినిమాకు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ కులాన్ని సంబోదిస్తూ సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత టైటిల్ ఛేంజ్ చేసి రిలీజ్ చేస్తే అంతగా వర్కౌట్ కాలేదు.ఇక అప్పట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ‘టైగర్ కేసీఆర్’ అనే టైటిల్‌తో బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా..ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంచలనం సృష్టించాడు. అంతేకాదు కేసీఆర్ తన పోరాటాన్ని ఆంధ్ర ప్రజలపై కాకుండా.. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచిన, మోసం చేసిన ఆంధ్రా నాయకులపైనే ఈ చిత్రం ఉంటుందని వర్మ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే కదా.. కేసీఆర్‌కు తెలుగు ప్రజలంటే ప్రేమ ఉంది. ఆయన పోరాట మంతా తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఆంధ్రా నాయకులపైనే అంటూ వివరణ ఇచ్చాడు.

  RRR : ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. మళ్లీ బ్రేక్ చేయాలంటే రాజమౌళి రావాలేమో..


  ఇక ఈ సినిమాకు అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు.ఈ సినిమాలో కేసీఆర్ పాత్ర కోసం మరో రంగస్థల నటుడిని ఎంపిక చేయాలనుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో  ఎన్టీఆర్ పాత్ర కోసం రంగస్థల నటుడిని తీసుకొచ్చినట్టు ..కేసీఆర్ బయోపిక్ కోసం మరో రంగస్థల నటుడిని వెతికి పట్టుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై ‘ఉద్యమ సింహం’తో పాటు శ్రీకాంత్ హీరోగా ‘తెలంగాణ దేవుడు’ టైటిల్స్‌తో సినిమాలు కూడా తెరకెక్కాయి. కానీ ఈ సినిమాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. మరి రామ్ గోపాల్ వర్మ.. కేసీఆర్ బయోపిక్‌లోని ఏ యాంగిల్‌ను తీసుకొని తెరకెక్కిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మరి చెప్పినట్టే.. ఆర్జీవి ఈసారైనా కేసీఆర్ బయోపిక్‌ను అనుకున్నట్టే తెరకెక్కిస్తారా లేకుండా పబ్లిసిటీ స్టంట్‌గా మిగిలిపోతుందా అనేది చూడాలి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ram Gopal Varma, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు