• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAM GOPAL VARMA GETTING READY TO SHOOT ONE MORE BIOPIC THIS TIME ITS ON YS JAGAN TITLED AS JAGAMONDI PK

Ram Gopal Varma - YS Jagan: వైఎస్ జగన్‌పై రామ్ గోపాల్ వర్మ చిత్రం.. టైటిల్ ఏంటంటే..?

Ram Gopal Varma - YS Jagan: వైఎస్ జగన్‌పై రామ్ గోపాల్ వర్మ చిత్రం.. టైటిల్ ఏంటంటే..?

వైఎస్ జగన్ రామ్ గోపాల్ వర్మ (YS Jagan RGV)

Ram Gopal Varma - YS Jagan: కొన్నేళ్లుగా వర్మ(RGV) తన రేంజ్‌కు తగ్గట్లుగా ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు. అలాంటి దర్శకుడు మధ్యలో బయోపిక్స్ రూపంలో కొన్ని సినిమాలు చేసాడు. అందులో వంగవీటి(Vangaveeti), కిల్లింగ్ వీర్పపన్(Killing Veerappan), అటాక్స్ 26/11(Attacks 26/11) లాంటి సినిమాలు పర్లేదనిపించాయి.

  • Share this:
రామ్ గోపాల్ వర్మ నుంచి ఒకప్పుడు సినిమాలు వస్తున్నాయంటే పండగ చేసుకునేవాళ్లు అభిమానులు. కానీ రాను రాను వర్మ సినిమాలు అంటే ఆసక్తి కాదు కదా చిరాకు మొదలైంది. అసలు ఎందుకు ఈయన సినిమాలు చేస్తున్నాడు అంటూ విమర్శలు కాదు తిట్టడమే మొదలు పెట్టారు. అంత దారుణమైన సినిమాలు ఈయన చేస్తున్నాడు. కొన్నేళ్లుగా వర్మ తన రేంజ్‌కు తగ్గట్లుగా ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు. అలాంటి దర్శకుడు మధ్యలో బయోపిక్స్ రూపంలో కొన్ని సినిమాలు చేసాడు. అందులో వంగవీటి, కిల్లింగ్ వీర్పపన్, అటాక్స్ 26/11 లాంటి సినిమాలు పర్లేదనిపించాయి. అవి ఫ్లాప్ అయినా కూడా వర్మ దృష్టి పెడితే మంచి సినిమాలు చేయగలడనే నమ్మకం అభిమానులలో కనిపించాడు. అలాంటి సమయంలో 2019 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ జీవితంలోని లక్ష్మీపార్వతి ఎపిసోడ్ తీసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సినిమా చేసాడు వర్మ. అప్పుడు ఆ సినిమా చేసిన రచ్చ మామూలుగా లేదు. ఆ తర్వాత అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అంటూ మరో సినిమా చేసి వర్మ కాంట్రవర్సీలకు తెరతీసాడు. అప్పట్నుంచి వర్మ సినిమాలు చేసే కోణమే మారిపోయింది.

ఏమైందో తెలియదు అమ్మ రాజ్యంలో తర్వాత ఏకంగా సెక్స్ సినిమాలు చేసాడు వర్మ. మధ్యలో మర్డర్, నేక్డ్, థ్రిల్లర్ అంటూ పిచ్చి పిచ్చి సినిమాలు అన్నీ చేసాడు వర్మ. ఇలాంటి సమయంలో మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని పూర్తి స్థాయిలో పొలిటికల్ సెటైర్ చేయాలని వర్మ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది.
rgv,rgv twitter,rgv instagram,rgv ys jagan biopic,rgv jagamondi movie,rgv ys jagan movie jagamondi,telugu cinema,రామ్ గోపాల్ వర్మ,రామ్ గోపాల్ వర్మ జగమొండి,రామ్ గోపాల్ వర్మ వైఎస్ జగన్ బయోపిక్
అమ్మరాజ్యంలో కడపబిడ్డలు రిలీజ్ పోస్టర్ (Amma Rajyamlo poster)

అది ఎవరి సినిమానో కాదు.. వైఎస్ జగన్ బయోపిక్‌ అని తెలుస్తుంది. ఈ సినిమాకు జగమొండి అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. దీనికి నిర్మాతగా కడప జిల్లాలో మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్ అయిన ఓ నాయకుడి కుమారుడు వ్యవహరిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన ఇప్పటికే ఆర్జీవీతో డి కంపెనీ చేస్తున్నాడు ఈయన. అతడే నిర్మాతగా జగన్ కథతో జగమొండి సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. జగన్ ఎంత మొండి ఘటమో.. రాజకీయంగా ఆయనెంత గట్టివాడు అనేది చూపించబోతున్నట్లు తెలుస్తుంది.
rgv,rgv twitter,rgv instagram,rgv ys jagan biopic,rgv jagamondi movie,rgv ys jagan movie jagamondi,telugu cinema,రామ్ గోపాల్ వర్మ,రామ్ గోపాల్ వర్మ జగమొండి,రామ్ గోపాల్ వర్మ వైఎస్ జగన్ బయోపిక్
ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan/File photo)

వైఎస్సార్ చనిపోయిన తర్వాత తన పదవి కోసం.. కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు రావడం దగ్గర్నుంచి సొంత పార్టీ పెట్టి తొలిసారి ఓడిపోవడం.. జైలుకు వెళ్లడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పాటు 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం వరకు సినిమా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య వరసగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్న వర్మ.. ఈ సారి కూడా ఇదే చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరి ఈయన జగమొండి ఎలా ఉండబోతుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు