• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAM GOPAL VARMA FIRST OTT RELEASE MIA MALKOVA CLIMAX MOVIE REVIEW PK

'క్లైమాక్స్' సినిమా రివ్యూ.. వర్మ కెరీర్ క్లైమాక్స్‌కే ఇంక..

'క్లైమాక్స్' సినిమా రివ్యూ.. వర్మ కెరీర్ క్లైమాక్స్‌కే ఇంక..

100 రూపాయలు కట్టి నా సినిమాను చూడండి అంటూ మియా మాల్కోవాతో వర్మ చేసిన క్లైమాక్స్ సినిమాను కనీసం పట్టించుకున్న వాళ్లు కూడా లేరు.

Climax movie review: రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్ సమయంలో కూడా ఖాళీగా కూర్చోలేక చేసిన సినిమా 'క్లైమాక్స్'. ఎప్పుడూ పని చేసే దర్శకుడికి ఒక్కసారిగా కరోనా వచ్చి ఖాళీ దొరికినా కూడా ఆయన మాత్రం ఉండలేకపోయాడు. అందుకే మియా మాల్కోవాను పెట్టి క్లైమాక్స్ అంటూ సినిమా చేసాడు. ఇప్పుడు ఇది ఓటిటిలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

  • Share this:
రివ్యూ: క్లైమాక్స్
నటీనటులు: మియా మల్కోవా - రెనాన్ సేవరో
సినిమాటోగ్రఫీ: అగస్త్య మంజు
సంగీతం: రవిశంకర్
నిర్మాత: ఏ కంపెనీ/ఆర్.యస్.ఆర్ ప్రొడక్షన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్ సమయంలో కూడా ఖాళీగా కూర్చోలేక చేసిన సినిమా 'క్లైమాక్స్'. ఎప్పుడూ పని చేసే దర్శకుడికి ఒక్కసారిగా కరోనా వచ్చి ఖాళీ దొరికినా కూడా ఆయన మాత్రం ఉండలేకపోయాడు. అందుకే మియా మాల్కోవాను పెట్టి క్లైమాక్స్ అంటూ సినిమా చేసాడు. ఇప్పుడు ఇది ఓటిటిలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..


కథ:
కేవలం మియా మాల్కోవా అందాలనే టార్గెట్ చేసి క్లైమాక్స్ సినిమా తెరకెక్కించాడు వర్మ. ఓ యువ జంట ఎంజాయ్ చేయడం కోసం ఎడారికి వెళ్తారు.. అక్కడ వాళ్లకు ఎలాంటి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి అనే కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ. అసలు ఎడారిలో ఉన్న విచిత్రమైన మనుషులు ఎవరు.. అక్కడ్నుంచి ఆ జంట బయట పడిందా లేదా అనేదే ఈ 'క్లైమాక్స్' స్టోరీ. కొన్ని అసహజమైన విషయాలను మనం వివరించలేం.. అలా వివరించగలిగితే అది అసహజమైనది కాదు అనే కొటేషన్‌తో 'క్లైమాక్స్' సినిమా ప్రారంభం అవుతుంది. ఈ సినిమా నిడివి కేవలం 52 నిమిషాలు మాత్రమే.

కథనం:
'క్లైమాక్స్' సినిమా చూసిన తర్వాత లాక్‌డౌన్ సమయంలో వర్మ ఖాళీగా ఉండుంటే బాగుండేమో అనిపిస్తుంది. అభిమానులు కూడా ఇదే అంటున్నారు. ఇంతకంటే చెత్త సినిమా ఇంక వర్మ తీయడు అన్న ప్రతీసారి అంతకంటే నాసీరకం సినిమాతో వస్తున్నాడు వర్మ. ఇప్పుడు క్లైమాక్స్ కూడా అంతే అంటున్నారు ఫ్యాన్స్. అసహజమైన విషయాలను వివరించలేం అంటూ కథను మొదలు పెట్టాడు వర్మ. ఇక అక్కడ్నుంచి చిన్న పిల్లాడు బంతితో ఆడుకున్నట్లు.. యిష్టమొచ్చినట్లు ఈ చిత్రాన్ని తీసాడు వర్మ. సినిమా చూసిన తర్వాత సగటు ప్రేక్షకుడు వర్మ నుంచి ఏం ఊహిస్తాడో ఒక్కటి కూడా అందులో కనిపించదు. పైగా మొదట్నుంచీ మియా మాల్కోవా అందాలతో పాటు తొడలను చూపించడానికే వర్మ ఆరాటపడ్డాడు. ఆమెను నగ్నంగా చూడ్డానికి సినిమా తీసానని ఇంటర్వ్యూలో చెప్పిన వర్మ సినిమాలో కూడా అదే చూపించాడు. సినిమా మొదలైన మొదటి 10 నిముషాలు మియా మల్కోవా తన బాయ్ ఫ్రెండ్ రెనాన్ సేవరోతో కలిసి ఎడారికి రావడం.. అక్కడ నో ఎంట్రీ బోర్డ్ చూసి కూడా పట్టించుకోకుండా లోపలికి రావడం.. ఎడారిలో ఉన్న ఒయాసిస్ దగ్గర రొమాన్స్ చేసుకోవడం లాంటి సీన్స్‌తో కథను నడిపించాడు వర్మ. అక్కడి నుండి క్లైమాక్స్ వరకు అసహజమైన సంఘటనలు జరుగుతున్నట్లు చిత్రీకరించాడు. అదేంటంటే సినిమా కథ అదే కదా అంటాడు.
అందుకే మొదట్లోనే అసహజమైన విషయాలను వివరించలేమంటూ కొటేషన్ కూడా వేసాడు కదా.. అందుకే కథ కూడా అసహజంగానే ఉంటుంది. విచిత్రంగా బిహేవ్ చేసే మనుషులను చూపించిన వర్మ కాస్త భయపెట్టే ప్రయత్నం చేసాడు కానీ అంతగా వర్కవుట్ కాలేదు. ఎడారిలో రొమాన్స్ చేసుకుంటున్న ఆ జంటకి బైక్‌లపై రైడింగ్ వచ్చిన కొంతమంది వచ్చి అమ్మాయిని వెంబడించడం.. ఏదో జరుగుతుందని భావించిన ఈ జంట అక్కడి నుండి వేరే చోటికి వెళ్లి రొమాన్స్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ వాళ్ల రొమాన్స్‌ను ఓ పిల్లాడు సెల్ ఫోన్‌లో షూట్ చేస్తాడు. అతడి నుండి మొబైల్ తీసుకునే ప్రయత్నంలో పిల్లాడు చనిపోయినట్లుగా క్రిందపడిపోతాడు. దీంతో ఈ జంట అక్కడ జరుగుతున్న సంఘటనలపై కంప్లైంట్ ఇవ్వడానికి చూస్తున్న తరుణంలో ఓ ఇంటికి పోలీస్ స్టేషన్ అని బోర్డు పెట్టి ఉండటం చూసి అక్కడికి వెళ్తారు.. కానీ అక్కడ హీరోపై అటాక్ జరుగుతుంది.. హీరోయిన్‌ను తీసుకెళ్లి చంపే సమయంలో హీరో వచ్చి ఆమెని సేవ్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు.. ఇదంతా మిగిలిన కథ. అసలు ఇందులో ఏం జరుగుతుందో అర్థం కాలేదు కదా.. కథ కూడా అలాగే ఉంటుంది. అందుకేనేమో ఈ చిత్రానికి 'క్లైమాక్స్' అనే పేరు పెట్టాడు వర్మ.

నటీనటులు:
ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అన్నీ మియా మాల్కోవానే. ఆమెనే తన అందాలతో 'క్లైమాక్స్' ను క్లైమాక్స్ వరకు నడిపించింది. కొన్నిచోట్ల బికినీతో మరికొన్ని చోట్ల నగ్నంగా కనిపిస్తూ అక్కడక్కడా రొమాన్స్ చేస్తూ కవ్వించింది మియా. ఆమె ప్రేమికుడి పాత్రలో రెనాన్ సేవరో పాత్ర పర్లేదు. మిగిలిన వాళ్లంతా జస్ట్ ఓకే..

టెక్నికల్ టీం:
రవి శంకర్ సంగీతం ఏముందని చెప్పాలి. అర్థం పర్థం లేని సౌండ్స్ తప్ప. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇక సినిమాటోగ్రఫీ పరంగా అగస్త్య మంజు పర్లేదనిపించాడు. దర్శకుడు వర్మ గురించి ఏం చెప్పాలి.. ఈ క్లైమాక్స్‌ చూసిన తర్వాత ఈయన కెరీర్‌కు ఇదే క్లైమాక్స్ అనుకోవాలేమో మరి..? ఎందుకంటే అలాంటి టేకింగ్‌తో ఈ సినిమా చేసాడు. కనీసం కథ లేకపోయినా కూడా క్వాలిటీ అయినా ఉంటే బాగుండు అనుకుంటున్న అభిమానులను మరింత నిరాశ పరుస్తున్నాడు వర్మ. అయితే ఈ సినిమాలో అక్కడక్కడా వర్మ కెమెరా పనితనం మాత్రం అదుర్స్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఎడారిలో నడుము సందులోంచి సూర్యున్ని చూపించిన షాట్ అద్భుతమే. అలాంటి అద్భుతాలు సినిమాలో కొన్ని ఉన్నాయి.

చివరగా ఒక్కమాట:
'క్లైమాక్స్'.. అవును చూస్తే నిజంగానే మనకు క్లైమాక్స్..

రేటింగ్: 1/5
Published by:Praveen Kumar Vadla
First published: