Ram Gopal Varma : ఆసక్తికర సీన్స్‌తో దిశా ఎన్‌కౌంటర్ ట్రైలర్..

Ram Gopal Varma : ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో మందుండే రామ్ గోపాల్ వర్మ దిశా పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: September 26, 2020, 1:05 PM IST
Ram Gopal Varma : ఆసక్తికర సీన్స్‌తో దిశా ఎన్‌కౌంటర్ ట్రైలర్..
దిశా ఎన్ కౌంటర్ మూవీ పోస్టర్ Photo : Twitter
  • Share this:
Ram Gopal Varma : ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో మందుండే రామ్ గోపాల్ వర్మ దిశా పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు వర్మ. ఆయన ఇప్పటికే పలు రాజకీయ, క్రైం అంశాలనీ వెండితెరపై హృద్యంగా చూపించగా.. 2019 నవంబర్‌లో హైదరాబాద్’లో జరిగిన దిశా అత్యాచార, హత్య సంఘటన నేపథ్యంలో ఈ తాజా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇక దిశా ఘటన విషయానికి వస్తే.. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు మానవ మృగాలు ఒక యువతిపై అత్యంత పైశాచికంగా దాడి చేసి హత్య చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన.. ఆ తర్వాత జరిగిన నిందితుల ఎన్‌కౌంటర్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న 'దిశా ఎన్‌కౌంటర్' చిత్ర ట్రైలర్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. విడుదల చేసిన ట్రైలర్‌లో దిశా తన బైక్ పార్క్ చేయడం చూపించాడు. కొందరు ఆ బైక్ గాలి తీసేయడం, ఆ తర్వాత దిశను చంపడం లాంటీ సన్నివేశాలతో ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహించాడు.


ఇక ఈ లాక్ డౌన్ సమయంలో అందరూ షూటింగ్స్ బంద్ చేసి కూర్చుంటే.. వర్మ మాత్రం పలు చిత్రాలను తెరకెక్కించాడు. అంతకు ముందు పలు రాజకీయ సబ్జెక్టులతో కలకలం రేపిన వర్మ ఆ తర్వాత ఊహించని విధంగా పలురకాల అంశాలను తీసుకొని చిత్రాలుగా తెరకెక్కిస్తున్నాడు. అందులో భాగంగా వస్తున్నవే.. కరోనా, మర్డర్, అల్లు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నవి.. త్వరలో విడుదల తేదిలను ప్రకటించనున్నాడు వర్మ.
Published by: Suresh Rachamalla
First published: September 26, 2020, 1:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading