Home /News /movies /

RAM GOPAL VARMA DANCE WITH NAINA GANGULY RGV DANCE WITH NAINA GANGULY ON STAGE MK

కేఏ పాల్‌ బాటలో రాంగోపాల్ వర్మ...మెంటల్ హాస్పిటలే గతి అంటున్న నెటిజన్లు...

(Image: Youtube)

(Image: Youtube)

ఇండియాలోనే సూపర్ స్టార్లుగా పేరొందిన అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, సౌత్‌లో నాగార్జున, వెంకటేష్, జగపతిబాబు, సూర్య, శివరాజ్‌కుమార్ లాంటి వాళ్లతో వరుస సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ ఇలా తన విపరీత ప్రవర్తన కారణంగా విమర్శల పాలవుతున్నారు.

ఇంకా చదవండి ...
    వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చేష్టలతో నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. ఇన్ని రోజులు వర్మ ఏం చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఆయనకు మతి చెడిందని, అందుకు విపరీతమైన ప్రవర్తన బయటపడిందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన నిర్మించిన ‘బ్యూటీఫుల్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఆ ఈవెంట్‌లో ఈ సినిమా హీరోయిన్‌ నైనా గంగూలీతో కలిసి వర్మ డాన్స్ చేశాడు. దానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు వర్మ ఏకంగా హీరోయిన్ నైనా గంగూలీ కాళ్లపై పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జనవరి 1న బ్యూటీఫుల్‌ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి.

    అయితే ’బ్యూటిఫుల్‌’ చిత్ర బృందం ప్రీ న్యూ ఇయర్‌ ప్రైవేటు పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ‘బ్యూటీఫుల్‌’ చిత్రబృందంతో కలిసి ఆర్జీవీ డాన్స్ చేశారు. ఈ క్రమంలోనే పార్టీ చివరలో నైనాతో కలిసి డ్యాన్స్‌ చేసిన ఆర్జీవీ ఆమె కాళ్లమీద పడ్డారు. దీంతో నైనా షాక్‌కు గురైంది. అంతే కాదు వర్మ ఎందుకలా చేశారో అర్థం కాక చిత్రయూనిట్ సైతం కంగారు పడింది. నిజానికి నైనా గంగూలీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆర్టిస్టు. వర్మ నిర్మించిన రంగీలా సినిమా నాటికి నైనా గంగూలీ కనీసం పుట్టలేదు.

    అంతేకాదు ఇండియాలోనే సూపర్ స్టార్లుగా పేరొందిన అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, సౌత్‌లో నాగార్జున, వెంకటేష్, జగపతిబాబు, సూర్య, శివరాజ్‌కుమార్ లాంటి వాళ్లతో వరుస సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ ఇలా తన విపరీత ప్రవర్తన కారణంగా విమర్శల పాలవుతున్నారు. అయితే గతంలో వర్మ ఏం చేసినా కరెక్టే అని నమ్మే హార్డ్ కోర్ అభిమానులు సైతం, నైనా గంగూలీ లాంటి దిగువ శ్రేణి నటి కాళ్ల మీద వర్మ పడటంతో మాకు ఏంటీ ఖర్మ అంటూ నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కేఏ పాల్ ఇదే విధంగా కారులో కూర్చొని బాక్సింగ్ చేస్తున్నట్లు వింతగా చేస్తే, అతడిని మానసిక రోగిగా తన ట్విట్టర్ లో పేర్కొన్న వర్మ, ప్రస్తుతం తాను చేసిన పని ఏంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Ka paul, Ramgopal varma, RGV

    తదుపరి వార్తలు