సంచలనాలకు కేరాఫ్.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal varma) మరోసారి కాంట్రోవర్సీ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈసారి మెగాస్టార్‌ను మెగా ఫ్యామిలీ(Mega Family) మీద ట్వీట్లు చేశారు. చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య సినిమా త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో ఆచార్య టీం ఈ మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. చిరు,చరణ్ కలిసి డాన్స్ చేసిన పాట రేపు ప్రేక్షకులను అలరించనుంది. ఆచార్య చిత్రం నుంచి 4వ పాటను రిలీజ్ చేస్తున్నట్లు చెప్పడానికి చిరు(Chiranjeevi), చరణ్(Ram charan) ఒక ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఈ వీడియోలో తండ్రీకొడుకులు డాన్స్ గురించి మాట్లాడుతూ.. చరణ్ నువ్వు తగ్గాలి అని చిరు. తగ్గనులే అంటూ చరణ్ మాట్లాడుకున్న సరదా సంభాషణ నెట్టింట వైరల్ అయ్యింది.
ఇక ఈ వీడియో పై వర్మ కామెంట్ చేశాడు. నేను మెగా హర్ట్ అయ్యాను.. చిరంజీవి, చరణ్ తగ్గను. తగ్గేదేలే అని అల్లు అర్జున్(Allu Arjun) డైలాగ్స్ వాడుతుంటే.. చిరంజీవి, చరణ్.. బన్నీ న్యూ మెగా హీరో అని ఋజువుచేసినట్లు ఉంది” అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో మరోసారి అల్లు ఫ్యామిలీ(Allu family)- మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేగింది. కొంతమంది వర్మ(RGV)కు సపోర్ట్ చేస్తుంటే… ఇంకొంతమంది వర్మను ఏకిపారేస్తున్నారు. సినిమాలు తీయటం చేతకాని వాడు ఇలాంటి ట్వీట్లతో లైంలైట్ లో వుండాలని ట్రై చేస్తాడు అని కొందరు.. నీకు పిచ్చి పట్టి ఇలా తిరుగుతున్నావు అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. వర్మపై మెగా ఫ్యాన్స్ అంతా దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఏం శాడిస్ట్వు రా నువ్వు అంటూ కొందరు అంటుంటే.. అల్లు అర్జున్ను మెగా ఫ్యాన్స్‌తో తిట్టించడానికే వర్మ ప్రయత్నిస్తున్నాడని’ మరికొందరు అంటున్నారు. చిరు,చరణ్,బన్నీ వంద కోట్లు కొల్లగొట్టే స్టార్లు అయితే.. నీ బతుక్కి పది లక్షల కూడా రావు అంటూ.. కొందరు నెటిజన్లు వర్మను బండ బూతులు తిడుతున్నారు.
ఇక ఆర్జీవీ మెగా ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడినా అది సెన్సేషనల్ గా మారుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి మరో మెగాస్టార్ అయ్యేది కేవలం అల్లు అర్జున్ మాత్రమేనని.. మిగతా ఎవ్వరికీ ఆ అర్హత లేదని చెప్పి సంచలనం సృష్టించిన వర్మ.. మరోసారి మెగా ఫ్యామిలీపై విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే వర్మకు అదే రేంజ్లో మెగా అభిమానులు. అటు బన్నీ ఫ్యాన్స్ గట్టిగా వేసుకుంటున్నారు. వర్మపై భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. మరి వర్మ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.