రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వింటేనే జనాల్లో ఏవో తెలియని వైబ్రేషన్స్. ఆయన మాట తీరు, లైఫ్ స్టైల్ అన్నీ కూడా ఎప్పుడూ హాట్ టాపిక్కే. నిత్యం ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలిచే ఈ వివాదాస్పద దర్శకుడు గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీపై వరుస కామెంట్స్‌తో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి బాలీవుడ్ పరువు తీసేలా వర్మ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారడమే గాక జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది.
'బాహుబలి' సినిమాతో టాలీవుడ్ ఖ్యాతి ఎల్లలు దాటింది. దేశ విదేశాల్లోకి తెలుగోడి సత్తా ఎగబాకింది. ముఖ్యంగా బీ టౌన్ ఆడియన్స్ ఈ సినిమాకు నీరాజనం పలికారు. దీంతో పలు సౌత్ ఇండియన్ సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి దక్షిణాది సినిమా సత్తా ఏంటో నిరూపిస్తున్నారు మేకర్స్. రీసెంట్గా సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ''పుష్ప, RRR, KGF2'' సినిమాలు బీ టౌన్లో భారీ రేంజ్ వసూళ్లు రాబట్టడంతో మరోసారి దక్షిణాది సత్తా బయటపడింది. ఈ పరిస్థితుల నడుమ బాలీవుడ్ గాలి తీసేలా రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అన్నట్లుగా ఉన్న ఈ తరుణంలో తనదైన శైలిలో ఓ కాంట్రవర్సీ ట్వీట్ వదిలారు వర్మ. 'థియేటర్స్‌లో సౌత్ ఇండియన్ సినిమాలు భారీ సక్సెస్ అందుకోవడం, బాలీవుడ్ మూవీస్ డీలా పడటం చూస్తుంటే రానున్న రోజుల్లో బాలీవుడ్ సినిమాలు ఓటీటీలకే పరిమితం అవుతాయేమో అనిపిస్తోంది' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ పెట్టారు ఆర్జీవీ. ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరైతే దిక్కులేక బాలీవుడ్ వెళ్లి మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్‌నే విమర్శిస్తున్నావా? అంటూ వర్మపై అటాక్ చేస్తున్నారు.
The way SOUTH films seem to be going in theatres and NORTH films don’t seem to be going, it looks like BOLLYWOOD should be soon making films only for OTT 😳
ఒకానొక సమయంలో సినిమా ట్రెండ్ మార్చేసిన ఆర్జీవీ.. గత కొన్నేళ్లుగా కాంట్రవర్సియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుండటం చూస్తున్నాం. కరోనా సమయంలో పలు బోల్డ్ కంటెంట్ సినిమాలతో ఓటీటీ వేదికలపై హంగామా చేసిన ఆయన రీసెంట్గా 'మా ఇష్టం' అంటూ ఓ లెస్బియన్ రొమాంటిక్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుంచారు. నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరు బ్యూటీలతో కాస్త వెరైటీగా సినిమా ప్రమోషన్స్ చేపట్టి చిత్రానికి హైప్ తీసుకొచ్చారు.
(News 18: Sunil)
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.