Home /News /movies /

RAM GOPAL VARMA COMMENTS ON APSARA RANI SWIMMING POOL VIDEO POST MS

Apsara Rani: ఆ హాట్ బ్యూటీని ఏంజెల్ అని RGV ఎందుకు పిలుస్తాడో కారణం తెలిసిపోయింది...

అప్సర రాణి.. రామ్ గోపాల్ వర్మ (ఫైల్)

అప్సర రాణి.. రామ్ గోపాల్ వర్మ (ఫైల్)

తెలుగు తెరపై హాట్ బ్యూటీగా వెలుగుతున్న తార అప్సర రాణి ( Apsara Rani).. ఆర్జీవీ (Ram Gopal Varma) ఆమెను తరుచూ ఏంజెల్ అని సంబోధిస్తుంటాడు. దానికి ఆర్జీవీ పెద్ద థీయరీలు కూడా చెప్పాడు. తాజాగా ఈ అమ్మడుని ఏంజెల్ అని ఎందుకు పిలుస్తాడో రాము చెప్పేశాడు.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
    Ram Gopal Varma - Apsara Rani: హీరోయిన్లను..! కాదు కాదు అమ్మాయిలను ఆరాధించడంలో ఈ ప్రపంచంలో రామ్ గోపాల్ వర్మ శైలే వేరు. హీరోయిన్లను సెక్సీగా చూపించాలన్నా.. వారి నుంచి నటనను రాబట్టాలన్నా అది ఆయనకే చెల్లింది. కెమెరా యాంగిల్స్ ఎక్కడ వాడాలో మన ఆర్జీవికి తెలిసినంతగా.. బహుశా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ దర్శకుడికీ తెలీదేమో. ఇక అమ్మాయిల అందాలను వర్ణించడంలో ఆయనకు ఆయనే పరిపాటి. ఆయన పరిచయం చేసిన హీరోయిన్ల జాబితా చాంతాడంతా. ఇక తాజాగా.. ఆర్జీవీ చేతిలో రూపుదిద్దుకున్న ఒడిశా శిల్పం అంకిత మహారాణా అలియాస్ అప్సర రాణి. ఆర్జీవీ తెరకెక్కించిన ‘థ్రిల్లర్’ సినిమాతో ఈ అమ్మడి ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటిదాకా పలు యాడ్ ఫిల్మ్స్, సినిమాలు చేసినా రాని గుర్తింపు మన ఆర్జీవీ చేసిన ఒక్క ఫోటోషూట్ తో తన ఫేట్ మారిపోయింది.

    అయితే ఆర్జీవీ ఆమెను తరుచూ ఏంజెల్ అని సంబోధిస్తుంటాడు. దానికి ఆర్జీవీ పెద్ద థీయరీలు కూడా చెప్పాడు. తాజాగా ఈ అమ్మడుని ఏంజెల్ అని ఎందుకు పిలుస్తాడో రాము చెప్పేశాడు.

    అసలు విషయానికొస్తే.. అప్సర రాణి ఇటీవలే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. దానిని చూసిన మన ఆర్జీవీ.. ‘వావ్ చాలా బాగుంది. అందుకే నేను నిన్ను ఏంజెల్ అని పిలుస్తాను..’ అని అన్నాడు. అంతేగాక.. ఈ వీడియోను ఎవరు షూట్ చేశారని ఆమెను ప్రశ్నించాడు. మరి గురువుగారు అడిగితే శిష్యురాలు సమాధానం చెప్పకుండా ఉంటుందా..? అందునా ఆమె అనుభవిస్తున్న సక్సెస్ అంతా ఆ గురువు గారి చలవేనాయే...!





    ఆర్జీవీ ట్వీట్ కు అప్సర స్పందిస్తూ.. తాను నటిస్తున్న ఒక చిత్రానికి సంబంధించిన వీడియో ఇది అని.. దీనిని పూజా భలేకర్ షూట్ చేయగా.. తానే ఎడిట్ చేశానని రిప్లై ఇచ్చిందీ హాట్ బ్యూటీ. ఏదెలా ఉన్నా గురు శిష్యుల చాట్ మాత్రం మరోసారి వైరల్ గా మారింది. వీరిరువురు కలిసి పలుమార్లు గోవాలో పార్టీ చేసుకుంటున్నట్టుగా ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలైన విషయం తెలిసిందే.

    ఇదిలాఉండగా.. ఇప్పటికే అప్సర రాణికి పలు ఆఫర్లు ఇచ్చిన ఆర్జీవీ.. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న ‘డీ కంపెనీ’లో కూడా అప్సరతో హాట్ ఐటెం నెంబర్ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలో నెట్ లో తెగ వైరలవుతున్నాయి.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Apsara Rani, Bollywood, Bollywood news, Ram Gopal Varma

    తదుపరి వార్తలు