కమ్మవారే అసలైన రాజులు..గోదావరి రాజులు రాజులే కాదు..ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

తాను కమ్మ కులానికి పెద్ద అభిమాని అని, వాళ్లే నిజమైన రాజులని పాలించే సత్తా ఉందని రాంగోపాల్ వర్మ అన్నారు. అదే పశ్చిమ గోదావరి రాజులు మాటలు వింటే నిజమైన రాజులెవరు అలా మాట్లాడరని చెప్పారు.

news18-telugu
Updated: November 10, 2019, 9:17 PM IST
కమ్మవారే అసలైన రాజులు..గోదావరి రాజులు రాజులే కాదు..ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
రామ్ గోపాల్ వర్మ
news18-telugu
Updated: November 10, 2019, 9:17 PM IST
నిత్యం వార్తల్లో నిలిచేందుకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ద్వారా ఏపీలో కొత్త సంచలనాలు రేపేందుకు సిద్ధమైపోయాడు. పూర్తి రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో సమకాలీన రాజకీయాల్లోని ప్రముఖులను చూపించే ప్రయత్నం చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సినిమా ట్రైలర్ సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది. అయితే తాజాగా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ ఏపీలోని రాజు సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతహాగా తాను కూడా అదే సామాజిక వర్గానికి చెందినప్పటికీ రాజులు చాలా సాత్వికులు అని చెప్పుకొచ్చాడు. తాను కమ్మ కులానికి పెద్ద అభిమాని అని, వాళ్లే నిజమైన రాజులని పాలించే సత్తా ఉందని అన్నారు. అదే పశ్చిమ గోదావరి రాజులు మాటలు వింటే నిజమైన రాజులెవరు అలా మాట్లాడరని చెప్పారు.

అంతేకాదు ఒక సారి తనతో భీమవరం రాజుల గురించి సినిమా తీయాలని కొందరు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు అడిగారని, అయితే విజయవాడలో రౌడీలు, హైదరాబాద్‌లో దాదాలు, రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు ఉంటారని, అయితే భీమవరంలో ఎవరు ఉంటారంటూ ఎద్దేవా చేశారు.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...