క్లైమాక్స్ సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం..

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్లైమాక్స్’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు.

news18-telugu
Updated: May 29, 2020, 2:43 PM IST
క్లైమాక్స్ సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం..
ఆర్జీవి క్లైమాక్స్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ (Twitter/Photo)
  • Share this:
‘రక్త చరిత్ర’ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ నుంచి సరైన సినిమా నుంచి చాలా కాలమే అయింది. ఈ సినిమా తర్వాత వర్మ నుంచి సరైన సినిమాలు రావడం లేదు. రాను రాను రాజు గుర్రం అదేదో అయినట్టు కథ, కథనం లాంటి ఏమి లేకుండా పిచ్చి పిచ్చి సినిమాలతో ఆయన డై హార్డ్ ఫ్యాన్స్‌ను కూడా హార్ట్ అయ్యేలా సినిమాలు చేసాడు. గత కొంత కాలంగా రామ్ గోపాల్ వర్మ.. ఏమి చేస్తున్నాడో ఆయనకు కూడా తెలియడం లేదు. ప్రస్తుతం కరోనా మహ్మామ్మారి కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. కానీ వర్మ మాత్రం ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి మరి ‘క్లైమాక్స్’ సినిమాతో పాటు కరోనా అనే సినిమాలను తెరకెక్కించాడు. అంతేకాదు ఆయా సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్‌ను కూడా విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఈ మూవీ ట్రైలర్ ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా క్లైమాక్స్  సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.


క్లైమాక్స్ సినిమాను  తనకు సంబంధిచంిన RGVWorldTheatre లో విడుదల చేయనున్నట్టు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. మియా మాల్కోవా ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాను జూన్ 6న రాత్రి 9 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు.ఈ సినిమా చూడాలనకునే ప్రేక్షకులు RGVWorld.in/ShreyasET వేదికపై ఎంచక్కా చూడొచ్చని చెప్పుకొచ్చాడు. పే ఫర్ వ్యూ మోడల్‌లో ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తెస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా చూడడానికి రూ. 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన లాగిన్ క్రెడెన్షియల్ త్వరలో ప్రకటిస్తానని ట్విట్టర్‌లో చెప్పుకొచ్చాడు. ఇంతకీ టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచిన రామ్ గోపాల్ వర్మ.. శనివారం సాయంత్రం 5 గంటలకు మరో ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు.

First published: May 29, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading