‘కమ్మ రాజ్యంలో’ బాలయ్య క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన వర్మ..

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ.. తన స్వీయ నిర్మాణంలో శిష్యుడు ..సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రపై రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.

news18-telugu
Updated: November 18, 2019, 9:10 PM IST
‘కమ్మ రాజ్యంలో’ బాలయ్య క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన వర్మ..
బాలకృష్ణ, ఆర్జీవి
  • Share this:
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ.. తన స్వీయ నిర్మాణంలో శిష్యుడు ..సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వర్మ ఏ సినిమా తీసినా.. వివాదాస్పద అంశాలు ఉండేలా చూసుకుంటాడు. వివాదాలతోనే తన సినిమాకు పబ్లిసిటీ పెంచుకోవడం రామ్ గోపాల్ వర్మ స్టైల్. తాజాగా కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు అంటూ ఏపీ పొలిటికల్ స్క్రీన్‌లోని ముఖ్యమైన పాత్రలను తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు వర్మ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ద్వారా సీఎం జగన్, చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ సహా అందరి క్యారెక్టర్లను చూపించబోతున్నట్టు వర్మ పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ఆఖరికి కేంద్రంలోని మోదీ, అమిత్ షాలను సైతం వదల్లేదు. అయితే ఇంత మంది పాత్రలను తెరపై చూపించేందుకు సిద్ధమైన వివాదాల వర్మ... టీడీపీలో అత్యంత కీలకమైన బాలకృష్ణ పాత్రను ఈ సినిమా ట్రైలర్‌లో చూపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా బాలయ్య ఈ సినిమాలో యాక్ట్ చేసే విషయమై రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు.

AP Elections 2019: Nandamuri Balakrishna Where Ended The NTR Biopic Movie..Ram Gopal Varma Started Lakshmis NTR Movie,Balakrishna Where Ended The NTR Biopic Movie..Ram Gopal Varma Started Lakshmis NTR Movie,Lakshmi's NTR Movie Review | రామ్ గోపాల్ వర్మ బాలయ్య, క్రిష్‌లు ఎక్కడైతే ఎన్టీఆర్ బయోపిక్‌ను ముగించారో .. అక్కడి నుంచే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ స్టోరీని ప్రారంభించాడు.Lakshmi's NTR Movie Review,Lakshmis NTR Movie Review,Lakshmi's NTR telangana release,Lakshmi's NTR censor board,Ram Gopal Varma Lakshmis NTR Movie Review,Ram Gopal Varma,RGV Lakshmi's NTR,RGV Lakshmis NTR,Tollywood News,Telugu Cinema, Balakrishna NTR Kathanayakudu, Balakrishna NTR Mahanayakudu, NTR Balakrishna Ram Gopal Varma Laxmis NTR, NTR true STORY, Mohan Babu, Bala krishna, Chandra Babu Naidu,NTR,NT Rama Rao,Lakshmi Parvathi,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రివ్యూ,రామ్ గోపాల్ వర్మ,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,ఎన్టీఆర్ కథానాయకుడు,బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు రామ్ గోపాల్ వర్మ బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు,లక్ష్మీస్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ బాలయ్య,Balakrishna started NTR Biopic Movies ..Ram Gopal Varma Finishing Touch With His Lakshmi's NTR Movie
రామ్ గెపాల్ వర్మ‌తో బాలకృష్ణ (File Photo)


ఈ సినిమాలో అసలు బాలకృష్ణ పాత్రనే లేదు. ఆయన క్యారెక్టర్ లేకుండానే ఈ సినిమాను తీసినట్టు ఒక యూ ట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సినిమాలో ఆయన పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. అందుకే బాలయ్య పాత్రను పెట్టలేదన్నారు. అంతేకాదు భవిష్యత్తులో ఆయనతో సినిమా చేసేది లేదని కూడా ఖరాఖండిగా చెప్పేసాడు. ఈ విషయమై బాలకృష్ణ నుంచి మీకు ఏమైనా వార్నింగులు వచ్చాయా అనే దానికి స్పందిస్తూ నాకు ఎవరి నుంచి ఎలాంటి వార్నింగ్‌లు రాలేదని చెప్పుకొచ్చారు.

 

First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు