రామ్ గోపాల్ వర్మ బ్యూటీఫుల్ ట్రైలర్.. నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్..

రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. ఆయన ఎప్పుడెలాంటి సినిమాతో వస్తాడో ఊహించడం కష్టం. ఎప్పుడూ ఒకేలా సినిమాలు కూడా చేయడు వర్మ. ఇప్పుడు కూడా ఈయన..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 9, 2019, 1:07 PM IST
రామ్ గోపాల్ వర్మ బ్యూటీఫుల్ ట్రైలర్.. నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్..
బ్యూటీఫుల్ ట్రైలర్ (Source: Twitter)
  • Share this:
రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. ఆయన ఎప్పుడెలాంటి సినిమాతో వస్తాడో ఊహించడం కష్టం. ఎప్పుడూ ఒకేలా సినిమాలు కూడా చేయడు వర్మ. ఇప్పుడు కూడా ఈయన పాతికేళ్ల కింద తెరకెక్కించిన రంగీలా సినిమాను స్పూర్థిగా తీసుకుని ఇప్పుడు బ్యూటీఫుల్ అనే మరో సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు కాదు కానీ నిర్మాత. అప్పట్లో రంగీలా ఓ సంచలనం. ఇప్పుడు దీన్ని గుర్తు చేస్తూ బ్యూటీఫుల్ చేస్తున్నాడు వర్మ. అందాన్ని మరింత అందంగా చూపించడంలో వర్మను మించిన దర్శకుడు లేడు. ఇప్పుడు ఈ ట్రైలర్‌‌లో కూడా ఇదే కనిపించింది. ముఖ్యంగా ట్రైలర్ అంతా నైనా గంగూలీ అందాలనే హైలైట్ చేసాడు.


పార్థ సూరి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్స్ హైలైట్ అయ్యాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించిన అగస్త్య మంజు ఈ సినిమాకు దర్శకుడు. వర్మ తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. అగస్త్య కూడా గురువు కలను బాగానే తీర్చడానికి చూస్తున్నాడు. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ యూ ట్యూబ్‌లో రచ్చ చేస్తుంది. డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్ మాత్రమే ఉంది. అన్నీ బ్యూటీఫుల్ అందాల ఆరబోతలే. అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకుడు మాత్రమే కాదు.. సినిమాటోగ్రాఫర్ కూడా. అందుకే అందాలను బాగా క్యాప్చర్ చేసాడు. మొత్తానికి ఈ ట్రైలర్ చూసిన తర్వాత వర్మ బ్యూటీఫుల్ అనిపిస్తున్నాడు.
First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading