బాలకృష్ణ ఎపుడైతే..వాళ్ల నాన్న ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసాడో..అప్పుడే రామ్ గోపాల్ వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి, చంద్రబాబు పాత్రలకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ను జోరుగా చేస్తున్నాడు.
ఈ సినిమాలో పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్‌గా బాహుబలి సినిమాలో కట్టప్ప, అమరేంద్ర బాహుబలిని చంపుతున్న సీన్ ఫోటోను పెట్టి ట్వీట్ చేశారు.
కట్టప్ప వెన్నుపోటు పొడిచిన పోస్టర్‌కు మార్ఫింగ్ చేసి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పుకోవాలంటూ నెటిజన్లకు ఓ ప్రశ్న వేశారు.అయితే ఈ పోస్టర్‌లో కట్టప్పగా చంద్రబాబుగా, బాహుబలి పాత్రలో వెన్నుపోటుకు గురైన వ్యక్తిగా ఎన్టీఆర్‌గా ఈ పోస్టర్‌ను డిజైన్ చేసాడు.
తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్‌ను రిలీజ్ చేసాడు. ఇందులో ఉన్నది ఎవరు అంటూ నెటిజన్లకు ఓ ప్రశ్న అడిగాడు.
ఈ ఫోటోలో ఎన్టీఆర్ పాత్రధారి ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండగా..వెనకాల చంద్రబాబు పాత్రధారి ఉన్నాడు. తాజాగా ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ బెస్ట్ కపుల్స్
ఇవి కూడా చదవండి
శంకర్, రాజమౌళిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్ ?
సౌత్ ఇండస్ట్రీని విడిచిపెట్టనంటున్న అక్షయ్
బాహుబలి ఖాతాలో మరో అరుదైన రికార్డు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NTR Biopic, Ram Gopal Varma, Telugu Cinema, Tollywood