Thriller Trailer Release: బాహుబలి రేంజ్‌‌లో ఆర్జీవి ‘థ్రిల్లర్’ ట్రైలర్ విడుదల..

బాహుబలి రేంజ్‌లో రామ్ గోపాల్ వర్మ.. తాను తెరకెక్కిస్తున్న ‘థ్రిల్లర్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసాడు.

news18-telugu
Updated: July 30, 2020, 3:56 PM IST
Thriller Trailer Release: బాహుబలి రేంజ్‌‌లో ఆర్జీవి ‘థ్రిల్లర్’ ట్రైలర్ విడుదల..
వర్మ థ్రిల్లర్ సినిమా (RGV thriller movie photo shoot/Facebook)
  • Share this:
బాహుబలి రేంజ్‌లో రామ్ గోపాల్ వర్మ.. తాను తెరకెక్కిస్తున్న ‘థ్రిల్లర్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసాడు. బాహుబలికి థ్రిల్లర్‌కు సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా ..! ఏమి లేదు. రాజమౌళి తాను తెరకెక్కించిన బాహబలి సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం వంటి నాలుగు భాషల్లో విడుదల చేస్తే.. రామ్ గోపాల్ వర్మ మాత్రం తాను తెరకెక్కిస్తున్న ‘థ్రిల్లర్’ సినిమా ట్రైలర్‌ను ఒకేసారి తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం, భోజ్‌పురి, మరాఠి, గుజరాతి, ఒడియా భాషల్లో విడుదల చేసి సంచలనం రేపాడు. ఈ సినిమాలో అప్సరా రాణి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్‌ విడుదల చేసారు. అందరు దర్శకులు తమ సినిమాలను ఎలా తెరకెక్కించాలనే విషయంలో ఆందోళనకు గురి అవుతుంటే వర్మ మాత్రం చక చకా సినిమాలను తెరకెక్కించేస్తున్నాడు. ఇప్పటికే ‘క్లైమాక్స్, ‘నగ్నం’, పవర్ స్టార్’ దాంతో పాటు మర్డర్’ సినిమాలతో పాటు తాజాగా థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.


ఈ ట్రైలర్‌‌లో రామ్ గోపాల్ వర్మ.. అప్సరా రాణి స్కిన్ షోతోనే ప్రేక్షకులను థ్రిల్ చేసాడు. ఈ ట్రైలర్‌లో కెమెరామెన్ తన పనితనాన్ని బాగానే చూపించాడు. మొత్తం ఫోకస్ హీరోయిన్ మీద పెట్టాడు. ఆమె ప్రతి మూమెంట్‌ను కెమెరాలో బంధించాడు. మొత్తంగా ఒక ఇంట్లో తీసిన అతి సాధారణ బడ్జెట్ సినిమా ఇది. ఈ ట్రైలర్‌లో ఒక ఇంట్లోకి వచ్చిన హీరోయిన్‌ను ఎవరో వెంటాడుతున్నట్టు ఉంటుంది. అది మనిషా లేక దెయ్యామా అనేది సస్పెన్స్. మొత్తంగా బ్యాక్ గ్రౌండ్‌లో హరి ఓం అంటూ భక్తి నేపథ్యం ఉన్న మ్యూజిక్‌ను ప్లే చేయడం వర్మకు మాత్రమే చెల్లుతుంది. ఈ సినిమాలో అప్సరా రాణితో పాటు రాక్ కచ్చి జోడిగా నటించిన ఈ రొమాంటిక్ మూవీకి ఇప్పటికే బోలెడంత పబ్లిసిటీ వచ్చేసింది. అంతేకాదు హీరో, హీరోయిన్లతో ఇంటిమేట్ సీన్స్‌ ఉన్న ఫోటో షూట్‌తో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసాడు.

ఈ సినిమాను కూడా వర్మ.. తనకు సంబంధించిన ఆర్జీవి వరల్డ్ థియేటర్, వ్రేయాస్ ఈటీ ఫ్లాట్‌ఫాంలో ఈ సినిమాను త్వరలో విడుదల చేయనున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 30, 2020, 3:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading