Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎపుడు ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పడం కష్టం. మనసులో ఏది ఉందో దాన్ని నిర్మోహమాటంగా మాట్లాడం దాన్ని చేసేయడం ఆర్జీవి మార్క్ స్టైల్. తాజాగా ఆర్జీవీ హీరోయిన్ అప్సర రాణి తన ఒళ్లొ కూర్చొబెట్టుకున్న ఫోటోను షేర్ చేసారు. కథానాయికను ఒళ్లొ కూర్చొబెట్టుకుని ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్నేళ్లు రామ్ గోపాల్ వర్మ తన చేతలతో వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు. వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నట్టే అర్ధం.తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చుకోవాలి. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన ఈయన ఇపుడు చెత్త సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడు ఏదో ఇష్యూ మీద కాంట్రవర్సీ ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం రామ్ గోపాల్ వర్మ శైలి.
గత కొన్నేళ్లుగా ఆర్జీవి నిజ జీవిత వివాదాస్పద సంఘటనలకు సంబంధించిన స్టోరీలు తెరకెక్కిస్తున్న అవేవి వర్కౌట్ కావడం లేదు. గత కొన్ని రోజులుగా కరోనాతో పాటు రాజకీయ నాయకులపై తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. అంతేకాదు బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరీతో జిమ్ చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే కదా.
తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. హీరోయిన్ అప్సర రాణి (Apsara Rani) ని తన ఒళ్లొ కూర్చొబెట్టుకుని ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసారు. ఈ ఫోటోను చూసి నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
అప్పట్లో నైనా గంగూలి హీరోయిన్‌తో డాన్స్ చేస్తూ కాళ్లపై పడిన సంగతి మరవకముందే రామ్ గోపాల్ వర్మ.. ఓ అమ్మాయితో డాన్సు స్టెప్పులు వేస్తూ ఆమె కాళ్లపై పడటం మరోసారి వార్తల్లో నిలిచింది. దాంతో పాటు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో అల్లు అర్జున్ కనబడకపోవడం పై రామ్ గోపాల్ వర్మ శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే కదా.
అప్సర రాణి విషయానికొస్తే.. రామ్ గోపాల్ వర్మ 'థ్రిల్లర్' మూవీలో నటించి కుర్రకారులో గుండెల్లో సెగలు రేపింది. ప్రస్తుతం 'డేంజరస్' మూవీ చేస్తోంది. అంతేకాదు రవితేజ 'క్రాక్' మూవీలో ఐటమ్ సాంగ్‌లోనూ అందాలు ఆరబోసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఒళ్లో కూర్చొని మరోసారి వార్తల్లో నిలిచింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.