Home /News /movies /

RAM GOPAL VARMA ANNOUNCED SENSATIONAL DISHA MOVIE AND SHOOTING WILL START VERY SOON PK

RGV నెక్ట్స్ సినిమా దిశ.. ట్వీట్ చేసిన సంచలన దర్శకుడు..

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ

Disha Movie: వర్మ దిశ సినిమా అనౌన్స్ చేసాడు. ఎవరు చేస్తారో అని ఇన్నాళ్లూ వేచి చూసిన వాళ్లకు సమాధానం దొరికేసింది. చివరికి రామ్ గోపాల్ వర్మనే దిశ సినిమాను ప్రకటించాడు. ఈ ఘటనపై పూర్తిస్థాయి సినిమా చేస్తున్నాడు ఈయన.

వాస్తవిక ఘటనలను సినిమాలుగా మార్చడంలో వర్మ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈయన కథల కోసం పెద్దగా వెతకడు.. కాంట్రవర్సీలే ఈయనకు కథలు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు వర్మ. కొన్నేళ్లుగా కేవలం రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఉండే కథలను మాత్రమే సినిమాలుగా తెరకెక్కిస్తున్న వర్మ.. ఇప్పుడు దిశ ఘటనపై ఫోకస్ చేసాడు. ఇది జరిగిన విధానం.. దోషులు మరణించిన విధానం చూసిన తర్వాత కచ్చితంగా ఎవరో ఒకరు సినిమా చేస్తారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. చివరికి అది వర్మ అనౌన్స్ చేసాడిప్పుడు. తన నెక్ట్స్ సినిమా దిశ అంటూ ట్వీట్ చేసాడు ఈయన. అంతేకాదు ఈ చిత్రంలో చాలా భయంకరమైన నిజాలు చెప్పబోతున్నానని ప్రకటించాడు.


రేప్ చేయాలనుకునే వాళ్లు భయంతో వణికిపోయేలా తన సినిమాలో సన్నివేశాలు ఉంటాయని.. అలాంటి వాళ్లకు ఓ లెసన్ తన సినిమా నేర్పిస్తుందని చెప్పాడు వర్మ. న్యాయశాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని లాయర్ ఏపీ సింగ్ లాంటి వాళ్లు ఆడుకుంటున్నారు.. వాళ్లతో ఆడుకునేలా తన సినిమా ఉంటుందని చెప్పాడు వర్మ. ఏపీ సింగ్ నిర్భయ దోషుల తరఫున వాదిస్తున్నాడు. వాళ్లకు ఉరి పడకుండా వాయిదాలు పడేలా చేస్తున్నాడు. అలాంటి వాళ్లే తన సినిమాలో విలన్స్ అంటున్నాడు ఈయన.


దిశ ఘటన తర్వాత రేపిస్టులు ఏం నేర్చుకోలేదని.. ఇంకా అలాంటి ఘటనలు ఆగలేదని తెలిపాడు వర్మ. అలాంటి వాళ్లకు తన సినిమాలో ఎలా శిక్షించాలో చూపిస్తానంటున్నాడు వర్మ. అసలు దిశ ఘటన ఎలా జరిగింది.. ఆ రోజు ఏం జరిగింది.. ఎందుకు వాళ్లు అలా చంపేయాల్సి వచ్చింది అనే ఘోర నిజాలు కూడా తన సినిమాలో చూపిస్తానంటున్నాడు ఈయన. ప్రతీ విషయం క్షుణ్ణంగా దిశ సినిమాలో ఉంటాయని చెప్పాడు ఆర్జీవీ. జనం కూడా దిశ లాంటి ఘటనలు జరిగినపుడు వెంటనే శిక్ష పడితే సంతోషిస్తారని చెప్పాడు.


కానీ నిర్భయ విషయంలో మాత్రం చట్టంలో లొసుగులను అడ్డుపెట్టుకుని తప్పించుకుంటున్నారని.. ఇంకా ఎంతకాలం ఇలా తప్పించుకుంటారో అంటూ సీరియస్ అయ్యాడు ఈ దర్శకుడు. ఒక్కసారి ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసాడు వర్మ. మొత్తానికి దిశ సినిమా కచ్చితంగా సమాజంలో జరిగే ఇలాంటి దారుణాలకు ఓ గుణపాఠంగా ఉంటుందని చెప్పాడు ఈ సంచలన దర్శకుడు. త్వరలోనే ఈ చిత్రం మొదలుపెడతానని ట్వీట్ చేసాడు వర్మ.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Disha murder case, RGV, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు