హోమ్ /వార్తలు /సినిమా /

‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వర్మ.. ఈసారైనా?

‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వర్మ.. ఈసారైనా?

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్

తన సినిమాకు పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బాగా తెలుసు. తన ప్రతీ సినిమా రిలీజ్‌కు ముందూ.. అదే పంథాను ఫాలో అవుతుంటారాయన. మీడియాలోనూ, ప్రేక్షకుల్లోనూ తన తాజా సినిమా గురించి తెగ హైప్ క్రియేట్ అయ్యేలా చూసుకుంటారు. ఎంత వద్దనుకున్నా టీఆర్పీ రావాలి కాబట్టి... మీడియా ఆయనను కెలక్కుండా ఉండదు.

ఇంకా చదవండి ...

    తన సినిమాకు పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బాగా తెలుసు. తన ప్రతీ సినిమా రిలీజ్‌కు ముందూ.. అదే పంథాను ఫాలో అవుతుంటారాయన. మీడియాలోనూ, ప్రేక్షకుల్లోనూ తన తాజా సినిమా గురించి తెగ హైప్ క్రియేట్ అయ్యేలా చూసుకుంటారు. ఎంత వద్దనుకున్నా టీఆర్పీ రావాలి కాబట్టి... మీడియా ఆయనను కెలక్కుండా ఉండదు. జనాల్లో వర్మ సినిమాపై లేనిపోని ఎక్స్‌పెక్టేషన్స్ పెరగకుండా ఉండవు. అయితే, రాము తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎన్టీఆర్ జీవితంలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నానంటూ వర్మ ప్రకటించిన నేపథ్యంలో.. ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న బొమ్మకు బయటకు వచ్చినా, ఏ ఒక్క వార్త తెలిసినా.. అది సంచలనంగా మారుతోంది. బాలకృష్ణ నటించి, నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు ఘోరంగా అట్టర్‌ప్లాప్ కావడానికి కూడా వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలే కారణమని చెప్పేవారు లేకపోలేదు.


    అయితే, లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమాను మార్చి 22న విడుదల కానుందని గతంలో రాంగోపాల్ వర్మ ప్రకటించారు. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న ఈ సినిమాను విడుదల చేయకూడదంటూ టీడీపీకి చెందిన కొందరు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో, ఆ తేదీన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను నిలిపివేయాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. అయితే ఈ అంశంలో సెన్సార్ బోర్డుపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించిన వర్మ.. చర్చలతోనే పరిస్థితిని చక్కదిద్దినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలనూ ప్రకటిస్తానని చెప్పారు. మరి, ఈ డేటుకైనా సినిమా రిలీజవుతుందో లేదో చూడాలి.

    First published:

    Tags: Lakshmis NTR, NTR, NTR Biopic, NTR Mahanayakudu, Ram Gopal Varma

    ఉత్తమ కథలు