నా సినిమాను ఆపాలనుకునే వారికి చెడువార్త : రామ్ గోపాల్ వర్మ

తన సినిమా 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ రేపు విడుదలౌతోందని.. ఆపాలనుకునే వారు ఇప్పుడు రావోచ్చు అంటూ వర్మ సవాల్ విసిరాడు.

news18-telugu
Updated: December 11, 2019, 7:41 PM IST
నా సినిమాను ఆపాలనుకునే వారికి చెడువార్త : రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ (Twitter/Photo)
  • Share this:
దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వివాదస్పద చిత్రం ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ పై తెలంగాణ హైకోర్టు విచారించింది. ఈ చిత్రంపై రివ్యూ కమిటీ, సెన్సార్‌ బోర్డు నిర్ణయం తీసుకోవాలని, తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు చిత్ర విడుదలపై రివ్యూ కమిటీ, సెన్సార్‌ బోర్డుదే తుది నిర్ణయమని హైకోర్టు తెలిపింది. దీంతో సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చింది.  ఈ సందర్భంగా వర్మ ట్వీట్ చేశాడు. 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను ఆపాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ దుర్వార్త అంటూ.. తన చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందని తెలిపాడు. సెన్సార్ బోర్డుతోనూ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని, కేసులు కూడా ఓ కొలిక్కి వచ్చాయని, మీ చెత్త ఐడియాలతో సినిమాను అడ్డుకోవడానికి మగవాళ్లు, జోకర్లు ఉంటే రావాలని  సవాల్ విసిరాడు. రాజ్యాంగం అందించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కును మాత్రం ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం రేపు విడుదల అవుతోందని పేర్కోన్నాడు.


చిరుత భామ నేహా శర్మను ఇలా ఎప్పుడైనా చూశారా...First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>