కమ్మ రాజ్యంలో కడప రెడ్లు : వర్మ మదిలో మరో టైటిల్.. ఏంటో తెలుసా?

Kamma Rajyamlo Kadapa Redlu : సినిమా పట్ల వర్మ ఎంత పకడ్బందీగా ఉన్నాడంటే.. ఒకవేళ టైటిల్ విషయంలో సెన్సార్ అభ్యంతరం చెప్తే.. ప్రత్యామ్నాయంగా ఇప్పటికే మరో టైటిల్ సిద్దం చేసుకున్నాడట.

news18-telugu
Updated: November 17, 2019, 4:34 PM IST
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు : వర్మ మదిలో మరో టైటిల్.. ఏంటో తెలుసా?
రామ్ గోపాల్ వర్మ
  • Share this:
రాంగోపాల్ వర్మ సినిమాల కంటే ఆయన మాటలపై చాలామందికి క్యురియాసిటీ. ఎలాంటి విషయమైనా సరే తనదైన దృష్టికోణంతో సరికొత్త వాదన వినిపించే మనిషి. అందుకే వర్మతో వాదించలేక చాలామంది చేతులెత్తేస్తుంటారు.వితండ వాదం అనుకున్నా సరే.. అర్థం పర్థం లేదు అనుకున్నా సరే.. వర్మ డోంట్ కేర్ అన్నట్టుగానే ఉంటాడు. అందుకే 'కమ్మ రాజ్యంలో కమ్మ రెడ్లు'పై ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఎప్పటిలాగే తన పని తాను చేసుకు పోతున్నాడు. సినిమా పట్ల వర్మ ఎంత పకడ్బందీగా ఉన్నాడంటే.. ఒకవేళ టైటిల్ విషయంలో సెన్సార్ అభ్యంతరం చెప్తే.. ప్రత్యామ్నాయంగా ఇప్పటికే మరో టైటిల్ సిద్దం చేసుకున్నాడట. ఆ టైటిల్ వినడానికి ఎలా ఉందంటే.. అచ్చు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' లాగే ఉంది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే.. 'మక రాజ్యంలో డకపరెడ్లు'. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆ టైటిల్‌ విన్న తర్వాత.. చాలామంది వర్మ ఆలోచనకు షాక్ అవుతున్నారు. కాగా, ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
First published: November 17, 2019, 4:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading