కోడలు ఉపాసనకు వంటింటి రహస్యం చెప్పేసిన మెగాస్టార్ చిరంజీవి...

చిరంజీవిలో మరో కోణం కూడా ఉంది. ఆయన వెండితెరపైనే కాదు...వంటింట్లో కూడా ప్రయోగాలు చేస్తారట. తాజాగా తన కోడలు ఉపాసనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తాను చేసిన వంటకం రహస్యం షేర్ చేసుకున్నారు.

news18-telugu
Updated: August 4, 2019, 8:44 PM IST
కోడలు ఉపాసనకు వంటింటి రహస్యం చెప్పేసిన మెగాస్టార్ చిరంజీవి...
కోడలు ఉపాసనతో చిరంజీవి (Image : Twitter)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై ఎన్నో ప్రయోగాలు చేసి, విభిన్న పాత్రలతో అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే చిరంజీవిలో మరో కోణం కూడా ఉంది. ఆయన వెండితెరపైనే కాదు...వంటింట్లో కూడా ప్రయోగాలు చేస్తారట. తాజాగా తన కోడలు ఉపాసనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తాను చేసిన వంటకం రహస్యం షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇదే విషయం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి స్వతహాగా భోజన ప్రియుడు ఒకసారి ఆయన షూటింగ్ కోసం చిక్‌మంగుళూరు వెళ్లినప్పుడు అక్కడ ఓ హోటల్‌లో దోశ ఆర్డర్ చేయగా, ఒక స్పెషల్ దోశను వాళ్లు సర్వ్ చేశారు. దాని టేస్ట్ మెగాస్టార్ కు విపరీతంగా నచ్చేసింది. ఇంకేముంది హోటల్ యజమానిని పిలిపించి, దోశ తయారీకి ఉపయోగించిన పదార్థాలు ఏంటని అడిగారు. అయితే అందుకు హోటల్ యాజమాని చెప్పేందుకు ఇష్టపడలేదు. పైగా అదంతా సీక్రెట్ అని చెప్పేశారు. దీంతో చిరంజీవి నిరాశతో అక్కడి నుంచి వచ్చేశారు. ఇంటికి వచ్చాక ఎలాగైనా ఆ దోశను తయారు చేయాలని చిరంజీవి ఆయన భార్యతో కలిసి ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి రకరకాల ప్రయోగాలు చేశారు. చివరికి చిక్‌మంగళూరులో తిన్న దోశ రుచి సాధించారు.

నిజానికి చిక్ మంగుళూరులో కంటే మెగాస్టార్ తయారుచేసిన దోశే రుచికరంగా వచ్చింది. ఇంకేముంది ఆ దోశ కోసం చిరంజీవి ఇంటికి ప్రముఖులంతా క్యూ కట్టారని కోడలు ఉపాసనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. అయితే చిక్ మంగుళూరు హోటల్ వారు దోశ రహస్యం అలాగే సీక్రెట్ గా ఉంచేసినా, మెగాస్టార్ మాత్రం ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ చట్నీస్ యజమానితో పంచుకున్నానని, అప్పటి నుంచి ఆ రెస్టారెంట్ మెనూలో సైతం మెగాస్టార్ దోశ అని సర్వ్ చేస్తున్నారని మెగాస్టార్ తెలిపారు.
Published by: Krishna Adithya
First published: August 4, 2019, 8:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading