• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAM CHARAN WRAPS UP 20 DAYS SCHEDULE OF MEGASTAR CHIRANJEEVI ACHARYA DIRECTED BY KORATALA SIVA SR

Ram Charan : చిరకాల కోరికను నేరవేర్చుకున్న రామ్ చరణ్.. సాయం చేసిన కొరటాల..

Ram Charan : చిరకాల కోరికను నేరవేర్చుకున్న రామ్ చరణ్.. సాయం చేసిన కొరటాల..

రామ్ చరణ్ (Twitter/Photo)

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఆయన తన తండ్రి చిరంజీవి సినిమా ‘ఆచార్య’లో కూడా ఓ కీలక పాత్రలో మెరవనున్నాడు.

  • Share this:
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఆయన తన తండ్రి చిరంజీవి సినిమా ‘ఆచార్య’లో కూడా ఓ కీలక పాత్రలో మెరవనున్నాడు. దీనికి సంబంధించిన షూట్‌లో ఆయన పాల్గోంటున్న సంగతి తెలిసిందే. ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల పాటు ఉండనుంది. దీంతో గత 20 రోజులుగా ఈ సినిమా కోసం తూర్పు గోదావరి మారేడు మిల్లి అడవుల్లో జరుగుతున్న ఆచార్య షూటింగ్‌లో పాల్గోంటున్న చరణ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించుకున్నాడు. దీంతో ఆయన హైదరాబాద్‌కు తిరిగి పయనం అయ్యాడు. ఇక ఆయన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌ షూటింగ్‌లో పాల్గొనన్నున్నాడు. అయితే ఎన్నాళ్లగానో తండ్రితో కలిసి సినిమా చేయాలని అనుకుంటున్న రామ్ చరణ్ ఈ సినిమాతో తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. ఫ్యాన్స్ కోరికతో పాటు తనకు తన తండ్రితో నటించాలనీ ఉందని గతంలో చాలా సార్లు చెప్పిన చెర్రీ ఈ విధంగా తన కోరికను ఆచార్య రూపంలో తీర్చుకున్నాడు.

    ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండా.. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్‌లు నిర్మిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక చిరంజీవ సరసన కాజల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమా సిద్ధా పాత్రలో ఓ నక్సలైట్‌గా కనిపించనున్నాడని టాక్. ఇక మరోవైపు చిరంజీవి ఈ సినిమాలో డబుల్ రోల్స్‌లో కనిపించనున్నాడట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. దీనికి సంబందించిన ఆ పాటను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం.


    ఆచార్య మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సోనూ సూద్ ప్రతినాయకుడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సోనూసుద్ ‌తో పాటు మరో నటుడు కూడా విలన్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. భీష్మ, అశ్వథ్థామ వంటి సినిమాల్లో విలన్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆయన మరోసారి తెలుగులో చిరంజీవి సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. జిష్షు సేన్ నాగశౌర్య ‘అశ్వథ్థామ’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాల్లో నటించనున్నాడు. రెండు రీమేక్‌లే కావడం విశేషం. మలయాళంలో మోహన్ లాన్ నటించిన లూసిఫర్‌ను ఆయన తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాకు మోహన రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇక మరోవైపు తమిళ్‌లో అజీత్ హీరోగా వచ్చిన వేదాళంను కూడా చిరంజీవి తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు