అవును మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ రీసెంట్గా ఒక పాటతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుంది. ‘స్టాలిన్’ తర్వాత చాలా ఏళ్లకు మరోసారి త్రిషతో చిరంజీవి జత కట్టాడు. సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్ హంగులు అద్దడం కొరటాల శివ స్పెషాలిటీ. ఈ చిత్రాన్ని కొరటాల శివ దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. . దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ‘గోవిందాచార్య’ అనే పేరును పరిశీలిస్తున్నాడు. ఈ టైటిల్‌తో పాటు ‘గోవిందా హరి గోవిందా’ అనే పేరును కూడా పరిశీలిస్తున్నారు.

చిరంజీవి రామ్ చరణ్ ఫైల్ ఫోటోస్
ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అత్యంత కీలకం అని చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కథకు ఇరవై ఏళ్ల క్రితం నాటి స్టోరీ ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో ప్రస్తావించనున్నారు. అందులో చిరంజీవిని చూపిస్తే.. అంతగా మ్యాచ్ కాదనే అభిప్రాయం కొరటాల శివ వ్యక్తం చేసారట. అందుకే ఈ చిత్రంలో యంగ్ చిరు పాత్రను రామ్ చరణ్‌తో చేయించాలనే ఆలోచనలో కొరటాల శివ ఉన్నట్టు చెబుతున్నారు. ఇక తన పాత్రలో నటించడానికి చిరు.. రామ్ చరణ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు.. ఏప్రిల్‌లో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 08, 2020, 14:24 IST