Ram Charan : శంకర్ సినిమా కోసం రామ్ చరణ్‌కు షాకింగ్ రెమ్యునరేషన్.. ఎంతంటే..

రామ్ చరణ్, శంకర్ (Twitter/Photo)

Ram Charan  :  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో సినిమా ఎంతో అట్టహాసంగా  ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ కోసం రామ్ చరణ్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

  • Share this:
    Ram Charan  :  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో సినిమా ఎంతో అట్టహాసంగా  ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) క్లాప్ కొట్టారు.  దర్శకుడు రాజమౌళి (Rajamouli), బాలీవుడ్ క్రేజీ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక  శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్ కోసమే దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు మాచారం. ఏమైనా శంకర్ రూటే సెపరేటు. మరోసారి తన సినిమాతో వార్తల్లో నిలిచారు. అంతేకాదు ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను కూడా విడుదల చేసారు.

    ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ టైటిల్ ఏ మేరకు న్యాయం చేస్తారనేది చూడాలి. మిగతా భాషల్లో ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారా.. లేకుంటే వేరే ఏదైనా టైటిల్ పెడతారా అనేది చూడాలి. ఈ సినిమా కోసం రామ్ చరణ్.. దాదాపు రూ. 80 కోట్ల వరకు పారితోషకం అందనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు పారితోషకంతో పాటు నిర్మాణంలో భాగస్వామిగా మారడంతో చెర్రీకి అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ దక్కబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

    చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..


    ఈ సినిమాను శంకర్ (Shankar) పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను శంకర్.. ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పోరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం.  సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే సమాచారం జరుగుతోంది.

    Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

    అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది. మరోవైపు శంకర్‌ కూడా తమిళ రైట్స్‌ పారితోషకంగా లభిస్తోంది. దాంతో పాటు దర్శకుడిగా పారితోషకం భారీగా అందుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 21న పూణేలో ప్రారంభం కానుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శంకర్ కంప్లీట్ చేసినట్టు సమాచారం. ఇక దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతోన్న 50వ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: