చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీపై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు..

శార్వరి నామ సంవత్సర ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. మామయ్య సోషల్ మీడియా ఎంట్రీ పై ఉపాసన స్పందించింది.

news18-telugu
Updated: March 26, 2020, 3:04 PM IST
చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీపై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు..
భార్య, కొడుకు, కోడలితో చిరంజీవి (Twitter/Photo)
  • Share this:
శార్వరి నామ సంవత్సర ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. తొలిసారి తన తల్లి అంజనా దేవితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి అభిమానులను ఖుషీ చేసారు చిరంజీవి. ఈయన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వివిధ చిత్ర సీమలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన సోషల్ మీడియా ఫ్లామ్‌ఫామ్‌లోకి రావడాన్ని స్వాగతిస్తూ అభినందలు తెలియజేసారు. చిరంజీవి మొదటగా ఉగాది శుభాకాంలక్షలు తెలిపుతూ.. కరోనా కట్టడికి కలిసి కట్టుగా అందరు ఐక్యంగా పోరాడాలన్నారు. అత్యవసరమైతే తప్ప మిగతా సమయాల్లో బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసారు. ఐతే.. చిరంజీవి సోషల్ మీడియాలో జాయిన్ కావడంతో చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్యైన ఉపాసన ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాసన ట్వీట్ చేసింది. అంతేకాదు చిరంజీవి ట్వీట్ చేసిన పేజ్‌ను షేర్ చేసింది. మరోవైపు రామ్ చరణ్ ట్విట్టర్ ఎంట్రీ పై స్పందించింది.

మరోవైపు చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడంపై హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాతో పాటు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.  హీరో నిఖిల్ సిద్ధార్ధ్, సాయి ధరమ్ తేజ్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ పై ఆనందం వ్యక్తం చేసారు. మరోవైపు మోహన్ బాబు, దర్శకుడు కొరటాల శివ, పూరీజగన్నాథ్, హీరో శ్రీకాంత్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ పై అభినందనలు తెలియజేసారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు