Home /News /movies /

Upasana Konidela: ఉపాసన చేసిన పనిని మెచ్చుకుంటున్న నెటిజన్స్.. మీలా అందరు ముందుకు రావాలంటూ..

Upasana Konidela: ఉపాసన చేసిన పనిని మెచ్చుకుంటున్న నెటిజన్స్.. మీలా అందరు ముందుకు రావాలంటూ..

ఉపాసన కొణిదెల (Upasana Konidela)

ఉపాసన కొణిదెల (Upasana Konidela)

Upasana Konidela: మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన ఏమి చేసినా సెన్సేషనే. టాలీవుడ్‌లో ఒక హీరో భార్యగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది ఉపాసన. తాజాగా ఉపాసన చేసిన పనిని అభిమానులు మెచ్చుకుంటున్నారు.

    Upasana Konidela: మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన ఏమి చేసినా సెన్సేషనే. టాలీవుడ్‌లో ఒక హీరో భార్యగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది ఉపాసన. కేవలం  మెగా కోడలుగా సమాజంంలో జరిగే ఇష్యూస్ పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఏదైనా ముఖ్యవిషయం ఉంటే అందరితో పంచుకుంటూ ఉంటుంది. కేవలం మెగా కోడలిగానే కాకుండా.. అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేనా.. రామ్ చరణ్, చిరంజీవి సోషల్ మీడియిలో ఎంట్రీ ఇచ్చే వరకు వారికి సంబందించిన ఏ అప్‌డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలిచింది.అంతేకాదు తాను నిర్వహిస్తోన్న పత్రికల కోసం సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా చేస్తూ వార్తల్లో నిలిచింది.

    తాజాగా చిరంజీవి కోడలు.. రామ్ చరణ్ సతీమణి.. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ పై వస్తోన్న అపోహలను తొలిగించారు. కరోనా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే వదంతల నేపథ్యంలో ఉపాసన స్వయంగా టీకా తీసుకొని మిగతావారిలో భరోసా కల్పించింది. సామాన్య ప్రజలు కరోనా వ్యాక్సిన్స్ పై ఎలాంటి సందేహాలు, భయాలు పెట్టుకోవద్దని ఉపాసన సూచించారు. ఇప్పటికే అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.


    ఇప్పటి వరకు  దేశవ్యాప్తంగా 25 లక్షల మందిపైగా ఆరోగ్య కార్యకర్తలు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచంలో వేగంగా పది లక్షలకు వ్యాక్సిన్ వేసిన దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. భారత్ ఆరు రోజుల్లోనే ఈ ఘనత సాధించిందని తెలిపారు. పది లక్షల మందికి వ్యాక్సిన్ వేసేందుకు అమెరికాకు 10 రోజులు పట్టిందని.. 12 రోజుల్లో స్పెయిన్, 14 రోజుల్లో ఇజ్రాయిల్, 18 రోజుల్లో బ్రిటన్, 19 రోజుల్లో ఇటలీ, 20 రోజుల్లో జర్మనీ, 27 రోజుల్లో యూఏఈలు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేశాయని తెలిపారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Corona Vaccine, Ram Charan, Tollywood, Upasana kamineni

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు