హోమ్ /వార్తలు /సినిమా /

Upasana: గత వారం అలా జరిగింది..ఇప్పుడంతా ఓకే.. ఉపాసన ఇంట్రస్టింగ్ పోస్ట్

Upasana: గత వారం అలా జరిగింది..ఇప్పుడంతా ఓకే.. ఉపాసన ఇంట్రస్టింగ్ పోస్ట్

తెలుగు ఇండస్ట్రీలో కేవలం హీరోలకు మాత్రమే కాదు.. వాళ్ల భార్యలకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్ల క్రేజ్ చూసి అంతా షాక్ అవుతుంటారు. బన్నీ, రామ్ చరణ్, నాని, మహేష్ బాబు లాంటి హీరోల సతీమణులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమెకు మెగా కోడలు అనే ఇమేజ్‌తో పాటు సొంతంగానూ మంచి గుర్తింపు ఉంది.

రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. తాజాగా ఆమె చేసిన పోస్టు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  రామ్ చరణ్ ఉపాసన గురించి నెటిజన్స్ అందరికీ బాగా తెలుసు. సోషల్ మీడియలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాల్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఉపాసన అనారోగ్యం బారిన పడినట్లు.. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్టు చేసింది. గతవారం తాను కోవిడ్‌ బారిన పడ్డానని, ప్రస్తుతం కోలుకున్నానని సోషల్‌ మీడియా వేదికగా ఉపాసన వెల్లడించింది.

  ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపాసన ఓ పోస్ట్ ను షేర్ చేసింది. చెన్నైలోని తన గ్రాండ్‌ పెరెంట్స్‌ను కలిసేందుకు కోవిడ్‌ టెస్ట్‌ చేసుకున్నానని, ఈ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. దీంతో వారం రోజులుగా వైద్యుల సూచనతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నట్లు ఆమె చెప్పారు.ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో... ‘ గత వారం టెస్ట్‌లో కోవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది.  ముందే వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. దీంతో డాక్టర్స్‌ నన్ను కేవలం పారాసిటమల్‌, విటమిన్‌ టాబ్లెట్స్‌ మాత్రమే వాడమని సూచించారు. ఈ మహమ్మారి సోకండంతో చాలా మంది  నీరసించిపోవడం, హేల్ప్ లాస్‌ అవ్వడం, బాడీ పెయిన్స్‌ వంటి సమస్యలు రావోచ్చని చెప్పారు. కానీ నాకు అలాంటి సమస్యలు ఏం కనిపించలేదు.

  ఎందుకంటే నాకు నేను మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాను. అందుకే నాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. మళ్లీ వైరస్‌ విజృంభిస్తుందా? అంటే చెప్పలేను. కానీ, మనం జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. చెన్నైలోని తాతయ్య-అమ్మమ్మలను కలిసేందుకు కోవిడ్‌ పరీక్షలు చేసుకోవడం వల్ల వైరస్‌ బయటపడింది. లేదంటే అసలు తెలిసేదే కాదు’ అంటూ ఉపాసన రాసుకొచ్చారు.

  గతంలో రామ్ చరణ్ కూడా కరోనా బారిన పడ్డాడు. హీరో రామ్ చరణ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అప్పట్లో ప్రకటించారు. తనకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవన్న చరణ్..,  ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాడు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డాడు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Ram Charan, Tollywood, Upasana konidela

  ఉత్తమ కథలు