ఉపాసన ప్రేమలేఖ.. రామ్ చరణ్‌కు మాత్రం కాదండోయ్..

Upasana Konidela: రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈమె. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 14, 2020, 8:25 PM IST
ఉపాసన ప్రేమలేఖ.. రామ్ చరణ్‌కు మాత్రం కాదండోయ్..
ఉపాసన కొణిదెల (Upasana Konidela)
  • Share this:
రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈమె. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఉపాసన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రేమ గురించి ఈమె చెప్పిన మాటలు చాలా మంది మనసులకు హత్తుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పర్సనల్ విషయాలతో పాటు ఆరోగ్య సూత్రాలు కూడా చెబుతుంది ఉపాసన. అప్పుడప్పుడూ ఫిట్‌నెస్‌ మంత్ర కూడా బాగానే ఇస్తుంది మెగా కోడలు. ఇక ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఆమె చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. రామ్ చరణ్ కాకుండా అందరికీ కలిపి ప్రేమలేఖ రాసింది ఉపాసన. సమాజానికి ఉపయోగపడేలా ఈమె లేఖ రాసింది. మనుషుల మధ్య బంధాలు.. అనుబంధాలు మరింత ధృఢంగా ఉండేలా ప్రేమికుల రోజు జరుపుకోవాలని చెప్పింది ఈమె.
నిన్ను నువ్వు ప్రేమించడమే అసలైన వాలెంటైన్స్ డే అంటుంది ఉపాసన. ఈ వాలంటైన్స్‌ డే రోజున బంధాలను మరింత బలంగా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించిన ఉపాసన.. తన ట్వీట్ చేసింది. ముందు నిన్ను నువ్వు ప్రేమించడానికి ప్రయత్నించు.. అప్పుడే ఇతరులను కూడా ఎలాంటి లాభం లేకుండా ప్రేమించే తత్వం నీకు అలవాటు అవుతుంది.. నీకు నువ్వు ప్రేమలేఖ రాసుకో.. నీకు సంతోషం కలిగించే పనులు మాత్రమే చేయ్ అంటూ ట్వీట్ చేసింది ఉపాసన. అలా చేసినపుడే నీ మార్పుకు నువ్వే సాక్ష్యంగా నిలుస్తావంటూ రాసుకొచ్చింది. ఉపాసన ట్వీట్‌పై నెటిన్లు స్పందిస్తూ.. మీలో చాలా విషయం ఉందండోయ్ అంటూ స్పందించారు. అందులో చాలా మందికి ఉపాసన కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది కూడా.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు