స్కూల్‌కు వెళ్తొన్న ఉపాసన.. మెగా కోడలు కొత్త ఇన్నింగ్స్..

మెగా కోడ లు రామ్ చరణ్ భార్య ఉపాసన కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. పెళ్లైన తర్వాత స్కూల్‌కు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: January 19, 2020, 1:11 PM IST
స్కూల్‌కు వెళ్తొన్న ఉపాసన.. మెగా కోడలు కొత్త ఇన్నింగ్స్..
ఉపాసన కొణిదెల కొత్త ఇన్నింగ్స్ (Twitter/Photo)
  • Share this:
మెగా కోడ లు రామ్ చరణ్ భార్య ఉపాసన కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. పెళ్లైన తర్వాత స్కూల్‌కు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన తాత ప్రతాప్ రెడ్డికి చెందిన అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేకాదు తన సంస్థలో వీడియో ఎడిటర్స్, సబ్ ఎడిటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్‌కు సంబంధించిన ఉద్యోగ విషయాలకు సంబంధించిన వార్తలను సోషల్ మీడియాలో పోస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తోంది. అంతేకాదు రామ్ చరణ్, చిరంజీవికి సంబందించిన ఏ అప్‌డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలుస్తోంది. తాజాగా ఉపాసన.. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌‌ను సందర్శించింది. అంతేకాదు అక్కడ బిజినెస్‌కు సంబంధించిన కోర్సులో జాయిన్ అయింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేసింది. మొత్తానికి  ఉఫాసన ఖాళీగా ఉండకుండా తన ఫ్యామిలీలకు సంబంధించిన బిజినెస్ కోసం ఏకంగా బిజినెస్ స్కూల్‌లో జాయిన్ కావడం విశేషం.
First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు