నిరుద్యోగులకు ఉపాసన కొణిదెల మరో బంపరాఫర్.. ఈ సారి మాత్రం..

ఉపాసన కొణిదెల.. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. తాజాగా మెగా కోడలు నిరోద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది.

news18-telugu
Updated: December 4, 2019, 11:17 AM IST
నిరుద్యోగులకు ఉపాసన కొణిదెల మరో బంపరాఫర్.. ఈ సారి మాత్రం..
ఉపాసన కొణిదెల (Instagram/upasanakaminenikonidela)
  • Share this:
ఉపాసన కొణిదెల.. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. అంతేకాదు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేనా.. రామ్ చరణ్, చిరంజీవికి సంబందించిన ఏ అప్‌డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలుస్తోంది. తాజాగా ఉపాసన ప్రతి బుధవారం సోషల్ మీడియా వేదికగా ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు ఇస్తోంది. ఇప్పటికే తనకు సంబందించిన మీడియా, హెల్త్ కేర్‌ కంపెనీలో కంటెంట్ రైటర్స్‌తో పాటు గ్రాఫిక డిజైనర్స్, వీడియో ఎడిటర్స్‌కు సంబంధించిన ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.
ఈ బుధవారం మాత్రం డైటీషియన్స్,నూట్రిషియన్స్ కావాలను అంటూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ప్రకటన ఇచ్చింది మెగా కోడలు. అంతేకాదు ఈ పోస్ట్ కావాలనుకునే వాళ్లకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చింది. తగిన అర్హతలు ఆసక్తిగల అభ్యర్ధులు తమకు సంబంధించిన పూర్తి వివరాలను పంపే ఈ మెయిల్ చిరునామాను కూడా పంపించింది. ఇక ఎందుకు ఆలస్యం.. మీరు ఉపాసన చెప్పిన అన్ని అర్హతలు ఉంటే వెంటనే ఈ చిరునామాకు మీ బయోడేటా పంపించండి.
First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>