కోడలు ఉపాసన సలహాలు పాటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి...ఎందుకో తెలుసా...?

ముఖ్యంగా డాన్సులు, ఫైట్స్ విషయంలో చిరంజీవి ఏమాత్రం కాంప్రమైజ్ కారని తెలిసిన విషయమే. అయితే శరీర బరువు తగ్గితే ఫిట్ నెస్ మరింత పెరుగుతుందని నిపుణుల సూచన మేరకు చిరు కసరత్తులు మొదలు పెట్టేశాడు.

news18-telugu
Updated: November 10, 2019, 6:31 PM IST
కోడలు ఉపాసన సలహాలు పాటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి...ఎందుకో తెలుసా...?
అత్తా మామ చిరంజీవి,సురేఖలతో రామ్ చరణ్ ఉపాసన (Twitter/Photo)
  • Share this:
ఫిట్ నెస్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఆరు పదులు దాటినప్పటికీ, శ్రద్ధ వహిస్తున్నాడని ఇటీవల సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఆన్‌స్క్రీన్ పై ఆయన చేసిన విన్యాసాలు చెప్పకనే చెప్పేశాయి. అయితే తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకు మెగాస్టార్ ఓకే చెప్పేశాడు. ఆ సినిమాకు సంబంధించినంత వరకూ చిరంజీవి తన ఫిట్ నెస్ మరింత పెంచుకునేందుకు కసరత్తులు చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా డాన్సులు, ఫైట్స్ విషయంలో చిరంజీవి ఏమాత్రం కాంప్రమైజ్ కారని తెలిసిన విషయమే. అయితే శరీర బరువు తగ్గితే ఫిట్ నెస్ మరింత పెరుగుతుందని నిపుణుల సూచన మేరకు చిరు కసరత్తులు మొదలు పెట్టేశాడు. కాగా చిరంజీవి కసరత్తులతో పాటు డైట్ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తున్నాడని తెలుస్తోంది. అందుకోసం కోడలు ఉపాసన సలహాలు పాటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఉపాసనా కామినేని అపోలో లైఫ్ సంస్థ అధినేతగా, అటు యూట్యూబ్ వేదికగా ఫిట్ నెస్ సలహాలు ఇవ్వడం ద్వారా ఫేమస్ అయ్యింది.

అంతేకాదు డైట్ విషయంలో ఆమె ఇచ్చే సలహాలు సూచనల కోసం లక్షలాది మంది ఫాలోయర్లు వేచి చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంత పేరు ప్రఖ్యాతలు సాధించిన ఉపాసన దగ్గరి నుంచి మెగాస్టార్ చిరంజీవి సలహాలు తీసుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం ఉండాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమాలో చిరంజీవి స్లిమ్ లుక్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>