మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం,కన్నడ,మలయాళ, హిందీలో రిలీజైంది. తెలుగులో హిట్టైన ఈసినిమా మిగిలిన భాషల్లో అంతగా ప్రభావం చూపించలేకపోయింది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో హిట్ టాక్ తెచ్చుకోవడంతో చరణ్ భార్య ఉపాసన ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఈ సందర్భంగా ఉపాసన తమన్నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఈ సినిమాలో నరసింహారెడ్డి ప్రియురాలి లక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించిన తమన్నాకు ఉపాసన ఖరీదైన ఉంగారాన్ని బహుమతిగా ఇచ్చారు. దీంతో తమన్నా ఆనందానికి అవధుల్లేవు. మరోవైపు తమన్నాకు ‘ఎఫ్2’ లో అహంకారపూరితమైన భార్య పాత్రలో నటించిన తమన్నా.. సైరా నరసింహారెడ్డి సినిమాలో ప్రజల్లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసే చైతన్యవంతురాలి పాత్ర పోషించడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.