Home /News /movies /

RAM CHARAN WATCHED MAHESH BABU NEPHEW GALLA ASHOK HERO MOVIE AND POSTED HIS REVIEW IN SOCIAL MEDIA PK

Ram Charan - Hero movie: మహేష్ బాబు మేనల్లుడి సినిమాకు రామ్ చరణ్ రివ్యూ.. పండగ చేసుకుంటున్న టీమ్..

గల్లా అశోక్ హీరో సినిమా చూసిన రామ్ చరణ్ (ram charan hero)

గల్లా అశోక్ హీరో సినిమా చూసిన రామ్ చరణ్ (ram charan hero)

Ram Charan - Hero movie: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అద్భుతమైన కల్చర్ ఏంటంటే.. ఒకరి సినిమాలు ఒకరు చూడటమే కాకుండా సోషల్ మీడియా వేదికగా దాని గురించి అద్భుతంగా ప్రశంసించడం. ఒకరు ఇద్దరు హీరోలు కాదు టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఇదే చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అద్భుతమైన కల్చర్ ఏంటంటే.. ఒకరి సినిమాలు ఒకరు చూడటమే కాకుండా సోషల్ మీడియా వేదికగా దాని గురించి అద్భుతంగా ప్రశంసించడం. ఒకరు ఇద్దరు హీరోలు కాదు టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఇదే చేస్తున్నారు. చిరంజీవి (Chiranjeevi), మహేష్ బాబు (Mahesh Babu), రామ్ చరణ్ (Ram Charan) లాంటి హీరోలు అయితే విడుదలైన ప్రతీ సినిమాను చూడటమే కాదు.. సోషల్ మీడియాలో రివ్యూలు కూడా ఇస్తుంటారు. మొన్నటికి మొన్న పుష్ప సినిమా చూసి ఫిదా అయిపోయాడు. అల్లు అర్జున్ నటనను ఓ రేంజ్‌లో పొగిడేసాడు. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమా చూసిన రామ్ చరణ్.. దాన్ని కూడా అలాగే పొగిడేసాడు. నాని హీరోగా నటించిన ఈ సినిమాను రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కించాడు. డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. విజయం కూడా అందుకుంది. ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను చూడటమే కాకుండా సోషల్ మీడియాలో రివ్యూ కూడా ఇచ్చాడు.

ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల కోసం చూస్తున్న రామ్ చరణ్.. తనకు దొరికిన గ్యాప్‌లో వరస సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యే శ్యామ్ సింగరాయ్, సేనాపతి సినిమాలు చూసిన చరణ్.. ఇప్పుడు మరో సినిమాను చూసాడు. మా కోసం మీరు టైం తీసుకొని సినిమా చూడడం.. చూసిన తర్వాత మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ధన్యవాదాలు తెలిపింది చిత్రయూనిట్. అంతేకాదు.. అలాగే ట్రిపుల్ ఆర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సాయి పల్లవి తెలిపింది.


తాజాగా ఈయన మరో సినిమా చూడటమే కాకుండా సోషల్ మీడియాలో తన రివ్యూ పోస్ట్ చేసాడు. అదే హీరో.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. అయితే టాక్ బాగున్నా కూడా కలెక్షన్స్ మాత్రం లేవు. సినిమాలో ప్యాడింగ్ బాగానే ఉన్నా.. గల్ల అశోక్ ఎవరో ప్రేక్షకులకు ఐడియా లేదు. అదే సినిమాకు మైనస్ అయిందంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే టాక్ బాగుండటంతో ప్రమోషన్స్ ఆపడం లేదు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా చరణ్ ఈ చిత్రం చూసి తన రివ్యూ పోస్ట్ చేసాడు. సినిమా ప్రపంచంలోకి అదిరిపోయే సినిమాతో వచ్చావ్ అశోక్ గల్లా అంటూ పొగిడేసాడు. అలాగే చిత్ర నిర్మాతలు పద్మావతి గల్లా.. జయదేవ్ గల్లాతో పాటు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను పొగిడేసాడు చరణ్. ఈయన ట్వీట్ సినిమా యూనిట్ ప్రమోషన్ కోసం వాడేసుకుంటుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Mahesh Babu, Ram Charan, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు