హోమ్ /వార్తలు /సినిమా /

‘విన‌య విధేయ రామ’ రామ లవ్స్ సీత సాంగ్.. చ‌ర‌ణ్ డాన్సులు కెవ్వుకేక‌..

‘విన‌య విధేయ రామ’ రామ లవ్స్ సీత సాంగ్.. చ‌ర‌ణ్ డాన్సులు కెవ్వుకేక‌..

వినయ విధేయ రామ పోస్టర్

వినయ విధేయ రామ పోస్టర్

విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రోజుకో కొత్త సాంగ్ విడుదల చేస్తున్నారు ‘వినయ విధేయ రామ‌’ టీం. ఇప్పటికే విడుదలైన ప్రోమో సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రామ లవ్స్ సీత అనే మరో పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఇంకా చదవండి ...

విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రోజుకో కొత్త సాంగ్ విడుదల చేస్తున్నారు ‘వినయ విధేయ రామ‌’ టీం. ఇప్పటికే విడుదలైన ప్రోమో సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆడియో పరంగా పాటలు అంతంత మాత్రంగానే ఉన్న వీడియోస్ మాత్రం మాయ చేస్తున్నాయి. తాజాగా రామ లవ్స్ సీత అనే మరో పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్ సినిమాను కూడా తలదన్నే రీతిలో ఈ పాటను చిత్రీకరించాడు బోయపాటి శ్రీను. కొరియోగ్రఫీ అయితే అద్భుతంగా ఉంది. డాన్సుల పరంగా రామ్ చరణ్ కుమ్మేసాడు.
నిమిషం 42 సెక‌న్ల నిడివి వున్న పాటను విడుదల చేశారు చిత్రయూనిట్. సినిమా ఎంత‌ గ్రాండ్‌గా ఉండబోతుందో ఈ ఒక్క పాటను చూస్తే అర్థం అయిపోతుంది. వందలాది మంది డాన్సర్లు.. చుట్టూ భారీ సెట్టింగులు.. రంగురంగుల కాస్ట్యూమ్స్.. ఇలా ఒక్క‌టేంటి అన్నీ అద్భుతంగా ఈ పాటకు కుదిరాయి. దేవీ ఇచ్చిన ఫాస్ట్ బీట్‌కు రామ్ చరణ్ డాన్సులు కూడా ఓ రేంజ్‌లో అదరగొట్టాడు. కైరా అద్వానీ అందాలు కూడా పాటకు ప్లస్‌గా మారాయి. ఓవరాల్‌గా ఈ ఒక్క పాట చూసిన తర్వాత సినిమాపై ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. జనవరి 11న ‘వినయ విధేయ రామ’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


షమా సికిందర్ హాట్ ఫోటోస్..ఇవి కూడా చదవండి..

‘మిస్టర్ మజ్ను’ హార్ట్ బ్రేక్ సాంగ్.. ఎమోషనల్ టచ్ ఇచ్చిన థమన్..


IMDB మోస్ట్ అవైటెడ్ ట్రెండింగ్ మూవీస్ 2019.. రామ్ చ‌ర‌ణ్‌కే అగ్ర‌స్థానం..


ర‌జినీకాంత్ చివ‌రి సినిమా రాజ‌మౌళితో.. తెర‌వెన‌క క‌థేంటి..?

First published:

Tags: Boyapati Srinu, Ram Charan, Telugu Cinema

ఉత్తమ కథలు