2019లో టాలీవుడ్‌లో ఓ విషయంలో రామ్ చరణ్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచాడు. ఈ యేడాది రామ్ చరణ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ సినిమా చేసాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. పూర్తి యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ‘వినయ విదేయ రామ’ సినిమా ట్రోలింగ్ విషయంలో టాలీవుడ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ రియాల్టీకి దూరంగా ఉన్నాయి. మాములుగా ఏ సినిమాలోనైనా యాక్షన్ సన్నివేశాలు నిజ జీవితంలో ఉండవు. ప్రేక్షకులు సినిమాలో వచ్చే ఫైట్స్ కథలో భాగంగా చూస్తూ ఎంజాయ్ చేస్తారు... కానీ పెద్దగా లాజిక్స్ పట్టించుకోరు. కానీ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’సినిమాలోని యాక్షన్ సీన్స్ చూసి ప్రేక్షకులు లాజిక్స్ విషయమై ఆలోచించారు. ముఖ్యంగా ఓ సన్నివేశంలో హీరో విలన్ గ్యాంగ్‌లోని ఒక వ్యక్తి తల తెగొట్టి పైకి ఎగిరేస్తే.. గద్దలు తన్నుకోవడం వంటివి సీన్స్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్‌కు గురయ్యాయి.
మరోవైపు హీరో ట్రైన్ ఎక్కి భారత్.. నేపాల్ బార్డర్ చేరుకోవడం లాంటివి చూసి ప్రేక్షకులకు పంటి కింద రాయిలా భావించారు. ‘రంగస్థలం’ వంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ తర్వాత రామ్ చరణ్.. ఇలాంటి ఓవర్ యాక్షన్ సన్నివేశాలు ఉన్న సినిమాను ఎలా ఒప్పుకున్నాడనే విషయం కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయింది. మొత్తానికి ఈ సినిమా నడవలేదనే బాధ కన్నా.. ఆ సినిమా తాలూకు ట్రోలింగ్స్ రామ్ చరణ్, బోయపాటి శ్రీనును బాగానే బాధించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boyapati Srinu, RRR, SS Rajamouli, Telugu Cinema, Tollywood, Vinaya Vidheya Rama