‘వినయ విధేయ రామ’ వచ్చి రెండు వారాలు అయిపోయింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఊహించిన విజయం సాధించలేకపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 62 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక నష్టాలు కూడా భారీగా రాబోతున్నాయనే సంగతి అర్థమైపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
‘వినయ విధేయ రామ’ వచ్చి రెండు వారాలు అయిపోయింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఊహించిన విజయం సాధించలేకపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 62 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక నష్టాలు కూడా భారీగా రాబోతున్నాయనే సంగతి అర్థమైపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మెగా వర్గానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లు ఈ చిత్రం నష్టాల గురించి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవడంతో ఆపకుండా దాన్ని ప్రమోషన్ కూడా చేస్తున్నారు. కావాలనే ఇప్పుడు చరణ్ సినిమా నష్టాల గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. గతేడాది ‘అజ్ఞాతవాసి’ సినిమా నష్టాలను పవన్ కళ్యాణ్‌తో పాటు త్రివిక్రమ్ కూడా భాద్యతగా తీసుకుని కాస్తైనా వెనక్కి ఇచ్చారు.
వినయ విధేయ రామ అజ్ఞాతవాసి
ఇక ఇప్పుడు ‘వినయ విధేయ రామ’ కూడా భారీ నష్టాలను మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటి వరకు కేవలం 62 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజుకే సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. ఇప్పుడు సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ కత్తిరించారు దర్శక నిర్మాతలు. అయినా కూడా ఎలాంటి ఫలితం లేదు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఏం చేసినా కూడా ‘వినయ విధేయ రామ’ పైకి రావడం కష్టంగానే కనిపిస్తుంది.
వినయ విధేయ రామ ట్రైలర్
తక్కువలో తక్కువ కనీసం 35 కోట్లకు పైగానే నష్టాలు తీసుకొచ్చేలా కనిపిస్తుంది ‘వినయ విధేయ రామ’. దాంతో ఇప్పుడు బయ్యర్లకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఓవర్సీస్లో కూడా భారీగా నష్టాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. రెండు వారాలు ముగిసిన తర్వాత కూడా ఎఫ్2 సినిమా కుమ్మేస్తుంటే.. మిగిలిన సంక్రాంతి సినిమాలన్నీ ఇప్పటికే తోక ముడిచాయి. సంక్రాంతి సీజన్.. రామ్ చరణ్, బోయపాటి శ్రీను అనే క్రేజ్ చూసి సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. మరి వీళ్లను ఆదుకునేది ఎవరో చూడాలిక.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.