RAM CHARAN VINAYA VIDHEYA RAMA 2 DAYS WW COLLECTIONS 4 CRORES ON SECOND DAY
‘వినయ విధేయ రామ’ 2 డేస్ కలెక్షన్స్.. పరిస్థితి దారుణం..
రామ్ చరణ్ స్టిల్
రామ్ చరణ్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. తొలిరోజు 26 కోట్ల షేర్ వసూలు చేసి తన స్టామినా చూపించిన మెగా వారసుడు.. రెండో రోజుకు వచ్చేసరికి దారుణాలు చూసాడు. వినయ విధేయ రామ రెండో రోజు పడిపోయింది. తొలిరోజుతో పోలిస్తే ఏకంగా 22 కోట్లు తక్కువగా తీసుకొచ్చింది.
రామ్ చరణ్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. తొలిరోజు 26 కోట్ల షేర్ వసూలు చేసి తన స్టామినా చూపించిన మెగా వారసుడు.. రెండో రోజుకు వచ్చేసరికి దారుణాలు చూసాడు. వినయ విధేయ రామ రెండో రోజు పడిపోయింది. తొలిరోజుతో పోలిస్తే ఏకంగా 22 కోట్లు తక్కువగా తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 4.10 కోట్ల షేర్‌తో సరిపెట్టుకుంది ఈ చిత్రం. రామ్ చరణ్ సినిమాల్లో అత్యంత పెద్ద డిజాస్టర్‌గా నిలిచే అవకాశాలు ‘వినయ విధేయ రామ’కు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
వినయ విధేయ రామ పోస్టర్స్
గతేడాది ‘రంగస్థలం’తో కెరీర్ లో పెద్ద విజయం అందుకున్న ఈ హీరో.. ఈ ఏడాదికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. చాలా ఏరియాల్లో సినిమా కలెక్షన్ల పరంగా దారుణంగా పడిపోయింది. మూడోరోజు మరింత దిగజారపోయేలా ఉంది ఈ చిత్ర పరిస్థితి. ‘వినయ విధేయ రామ’ తెలుగు రాష్ట్రాల్లో 79 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కనీసం 40 కోట్లు అయినా తీసుకొస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు రెండు రోజుల్లో 29.50 కోట్ల షేర్ వసూలు చేసింది.
వినయ విధేయ రామ పోస్టర్
ఇక ఓవర్సీస్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. అక్కడ 7 కోట్లకు సినిమాను అమ్మితే ఇప్పటి వరకు కనీసం 40 లక్షలు కూడా రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ అయితే బయ్యర్లు దారుణంగా మునిగిపోవడం ఖాయం. మొత్తంగా రెండు రోజుల తర్వాత ‘వినయ విధేయ రామ’ ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాడు. మరి సంక్రాంతి సీజన్ తర్వాత ఎలా ఉండబోతుందో ఈ చిత్ర పరిస్థితి చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.