రామ్ చరణ్ నా తమ్ముడు.. సల్మాన్ ఖాన్ ఎమోషనల్ స్టేట్‌మెంట్స్..

సల్మాన్ ఖాన్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే తెలుసు. ఈయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. తాజాగా ఇప్పుడు దబంగ్ 3 సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించడానికి వస్తున్నాడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 18, 2019, 9:07 PM IST
రామ్ చరణ్ నా తమ్ముడు.. సల్మాన్ ఖాన్ ఎమోషనల్ స్టేట్‌మెంట్స్..
దబంగ్ 3 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్
  • Share this:
సల్మాన్ ఖాన్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే తెలుసు. ఈయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. తాజాగా ఇప్పుడు దబంగ్ 3 సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించడానికి వస్తున్నాడు కండల వీరుడు. కొన్నేళ్లుగా ఈయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు కూడా దబంగ్ 3తో వస్తున్నాడు ఈయన. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. దీనికి రామ్ చరణ్, వెంకటేష్ ముఖ్య అతిథులుగా వెళ్లారు. ఇక రామ్ చరణ్ తనకు సల్మాన్ అంటే ఎంత ప్రేముందో మరోసారి చెప్పుకొచ్చాడు.ఒక్క ఈవెంట్.. ఒక్క స్టేజ్‌లో సల్లూ భాయ్‌పై తనకున్న ప్రేమ చెప్పుకోడానికి సరిపోదంటూ తెలిపాడు మెగా వారసుడు. సల్మాన్ భాయ్, చిరు, వెంకీ, సుదీప్ లాంటి స్టార్స్ దగ్గర్నుంచీ తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు చరణ్. నెక్ట్స్ జనరేషన్ వీళ్లను స్పూర్థిగా తీసుకోవాలని చెప్పాడు చరణ్. ఇక వెంకటేష్ కూడా దబంగ్ 3 తెలుగులో రావడం సంతోషంగా ఉందని చెప్పాడు. సినిమాను సూపర్ హిట్ చేసి మన ప్రేమను చూపించాలని తెలిపాడు. చివరగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు.

Ram Charan Venkatesh attends Salman Khan Dabangg 3 telugu version pre release event pk సల్మాన్ ఖాన్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే తెలుసు. ఈయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. తాజాగా ఇప్పుడు దబంగ్ 3 సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించడానికి వస్తున్నాడు.. salman khan,salman khan twitter,salman khan ram charan,salman khan venkatesh,dabangg 3 pre release event,dabangg 3 pre release event live,dabangg 3 telugu pre release event live,ram charan speech,ram charan speech at dabangg 3 pre release event,dabangg 3 trailer,dabangg 3 pre release live,dabangg 3,dabangg 3 pre release event hyderabad,dabangg 3 telugu pre release event,salman khan dabangg 3 pre release event live,ram charan,telugu cinema,దబంగ్ 3,దబంగ్ 3 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్,రామ్ చరణ్ వెంకటేష్ సల్మాన్ ఖాన్,రామ్ చరణ్ సల్మాన్ ఖాన్
దబంగ్ 3 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్


రామ్ చరణ్‌ను తాను చిన్నప్పట్నుంచి చూస్తున్నానని.. చిరు సర్ తనకు బాగా తెలుసని చెప్పాడు. రామ్ తనకు తమ్ముడు అని చెప్పాడు సల్లూ భాయ్. తెలుగు హీరోల్లో వెంకటేష్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. వెంకీ మామా.. గత 25 ఏళ్లుగా తనకు తెలుసని చెప్పాడు సల్లూ భాయ్. దబంగ్ 3 అందరికీ నచ్చుతుందని చెప్పాడు కండల వీరుడు. సినిమాలో తన స్థాయిని పెంచే పాత్రను సుదీప్ చేసాడని చెప్పాడు. స్పీచ్ చివర్లో ఆటకైనా వేటకైనా రెడీ అంటూ ఓ తెలుగు డైలాగ్ చెప్పాడు సల్మాన్ ఖాన్. డిసెంబర్ 20న దబంగ్ 3 విడుదల కానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: December 18, 2019, 9:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading