Ram Charan - Upasana: భర్త రామ్ చరణ్‌తో గొడవల గురించి తొలిసారి నోరు విప్పిన ఉపాసన. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌లో మెగా పవర్ స్టార్ భార్యగా.. మెగాస్టార్ చిరంజీవి కోడలుగా.. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ఉపాసనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు రామ్ చరణ్, ఉపాసన ఐదేళ్లు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఫ్యామిలీకి, అపోలో ప్రతాప్ రెడ్డి కుటుంబానికి మంచి పేరే ఉంది. ఉపాసన విషయానికొస్తే.. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది.మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. అంతేకాదు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేనా.. రామ్ చరణ్, చిరంజీవి సోషల్ మీడియిలో ఎంట్రీ ఇచ్చే వరకు వారికి సంబందించిన ఏ అప్‌డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలిచింది.అంతేకాదు తాను నిర్వహిస్తోన్న పత్రికల కోసం సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా చేస్తూ వార్తల్లో నిలిచింది.
నిన్న ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా తన ప్రేమకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంది. అంతేకాదు 8 ఏళ్ల తమ వివాహా బంధంలో మేమిద్దరం ఎన్నోసార్లు గొడవలు పడ్డ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మా మధ్య వచ్చిన గొడలన్ని చిలిపి తగాదేలనని విడమరిచి చెప్పింది. అంతేకాదు 8 ఇయర్స్ లో ఓ ప్రేమికుల దినోత్సవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు.
With the loves of my life ?? #HappyValentinesDay2021
Love unconditionally
accept graciously &
respect immensely
❤️? pic.twitter.com/lmHkwW9ypV
— Upasana Konidela (@upasanakonidela) February 14, 2021
మా మధ్య బహుమతులకున్న ఒకరితో ఒకరు గడిపిన అపురూప క్షణాలంటేనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తాం అంటూ చెప్పుకొచ్చింది. ఎంత ఖరీదైన గిఫ్ట్స్ కాదు. మన లైఫ్ పార్టనర్‌ను ఎంతో ఆనందంగా చూసుకున్నామనే విషయానికే మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. చరణ్ నాకు భర్త అనే కాదు.. మంచి ఫ్రెండ్... ఫిలాసర్ అంటూ చెప్పుకొచ్చింది. నాకు విలువైన ఎన్నో మధుర క్షణాలను చరణ్ అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక పెళ్లైన తర్వాత మా మొదటి వాలెంటైన్స్ డేను నేను ఎప్పిటికీ మరిచిపోలేను. ఎందుకంటే చరణ్ సినిమా షూటింగ్‌లతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నా కోసం లవ్ సింబల్‌తో కూడిన ఇయర్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన విషయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు.
భార్యా భర్తలన్నాకా.. విభేదాలు రావడం ఎంతో సహజం. కాపురంలో చిన్న చిన్న గొడవలే వివాహా బంధాన్ని మరింత రాటుతేలుస్తాయి. అలా మా మధ్య ఎన్నో చిలిపి తగాదాలొచ్చాయి. వాటిని మేమిద్దరం ఎంతో కలిసి కట్టుగా ఎదుర్కొన్నాం. మాదే కాదే.. అందరి కాపురాల్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఎంతో కామన్ అంటూ తమ వివాహా బంధంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు ఉపాసన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Charan, Tollywood, Upasana kamineni