Rana Daggubati marriage: రానా పెళ్లిలో రామ్ చరణ్ సందడి..

Ram Charan in Rana marriage: టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితుల సమక్షంలో ఓ ఇంటి వాడయ్యాడు రానా. రామానాయుడు స్టూడియోస్‌లో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 8, 2020, 10:50 PM IST
Rana Daggubati marriage: రానా పెళ్లిలో రామ్ చరణ్ సందడి..
రానా పెళ్లిలో రామ్ చరణ్ సందడి (rana ram charan)
  • Share this:
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితుల సమక్షంలో ఓ ఇంటి వాడయ్యాడు రానా. రామానాయుడు స్టూడియోస్‌లో వైభవంగా జరిగిన ఈ వేడుకకు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. కోవిడ్ కారణంగా ఎవర్నీ ఈ పెళ్లికి ఆహ్వానించలేదు రానా. ఈ విషయంలో సురేష్ బాబు చాలా బాధ పడుతున్నట్లు కూడా చెప్పాడు. పరిస్థితులు చక్కబడిన తర్వాత అదిరిపోయే వేడుక చేయాలని చూస్తున్నారు దగ్గుబాటి కుటుంబ సభ్యులు. ఇదిలా ఉంటే రానా పెళ్లిలో రామ్ చరణ్ సందడి చేసాడు.
రానా పెళ్లిలో రామ్ చరణ్ సందడి (rana ram charan)
రానా పెళ్లిలో రామ్ చరణ్ సందడి (rana ram charan)

కుటుంబ సభ్యులు కాకుండా బయటి నుంచి వచ్చిన వాళ్లలో రామ్ చరణ్, శర్వానంద్ మాత్రమే ఉన్నారు. నాగ చైతన్య, సమంత దంపతులు వచ్చారు. నాగార్జున కుటుంబం కూడా కనిపించలేదు. కేవలం కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులను మాత్రమే ఆహ్వానించాడు రానా. అందులో రామ్ చరణ్ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా ప్రాణ స్నేహితులు ఇద్దరూ. పెళ్లిలో కూడా చాలా గోల చేసారు ఈ జోడీ.
Published by: Praveen Kumar Vadla
First published: August 8, 2020, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading