మరో క్రేజీ దర్శకుడితో రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్..

ప్రస్తుతం రామ్ చరణ్..హీరోగా నటిస్తూనే.. నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ వ్యవహారాలను చక్కబెడుతున్నాడు. తాజాగా రామ్ చరణ్ మరో క్రేజీ దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు సమాచారం.

news18-telugu
Updated: October 30, 2019, 7:29 AM IST
మరో క్రేజీ దర్శకుడితో రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్..
రామ్ చరణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రస్తుతం రామ్ చరణ్..హీరోగా నటిస్తూనే.. నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ వ్యవహారాలను చక్కబెడుతున్నాడు. రీసెంట్‌గా తండ్రి మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇద్దరు చారిత్రక యోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో జక్కన్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తర్వాత రామ్ చరణ్..తండ్రి చిరంజీవితో కలిసి మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ సినిమా రీమేక్‌లో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా రామ్  చరణ్...విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించబోతున్నట్టు సమాచారం.

ram charan to work with vikram kumar direction after rajamouli rrr project,ram charan,vikram k kumar,vikram kumar,vikram kumar ram charan,ram charan instagram,ram charan facebook,ram charan twitter,ram charan,rajamouli ram charan,rrr,rajamouli,rrr rajamouli vikarm kumar,ram charan movies,ram charan speech,vikram,ram charan vijay and vikram together,ram charan vvr movie,vikram kumar,ram charan entry,ram charan in mani ratnam film,ram charan movies 2017,ram charan songs telugu,vikram k kumar hello,akhil and ram charan,ram charan new movie hindi dubbed 2019,ram charan - akhil's friendship & bonding,bollywood,tollywood,telugu cinema,రామ్ చరణ్,ఆర్ఆర్ఆర్,రాజమౌళి,విక్రమ్ కుమార్,ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ రాజమౌళి,రామ్ చరణ్ విక్రమ్ కుమార్,విక్రమ్ కుమార్ రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్
రామ్ చరణ్,విక్రమ్ కుమార్ (Twitter/Photo)


తెలుగులో 13బి, ఇష్క్, మనం, 24, గ్యాంగ్ లీడర్’ వంటి చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని ఏర్పరుచుకున్న విక్రమ్ కుమార్..రామ్ చరణ్ ఇమేజ్ తగ్గ ఒక డిఫరెంట్ స్టోరీ రెడీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే విక్రమ్ కుమార్.. చరణ్‌ను కలిసి ఒక లైన్ వినిపించి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. ఈ సినిమా విక్రమ్ కుమార్ శైలిలో డిఫరెంట్ మూవీ అని చెబుతున్నారు. మరి మాస్ హీరో అయిన రామ్  చరణ్‌తో క్లాస్ దర్శకుడైన విక్రమ్ కుమార్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి.
First published: October 30, 2019, 7:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading