సల్మాన్, అమీర్... రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్

సాహో మూవీ బాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో... సైరా కోసం రామ్ చరణ్ కొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 8, 2019, 8:14 PM IST
సల్మాన్, అమీర్... రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్
రామ్ చరణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
బాహుబలి సినిమా సక్సెస్ కారణంగా సాహో సినిమాకు బాలీవుడ్‌లో పెద్దగా కష్టపడకుండానే ప్రమోషన్ కావాల్సినంత ప్రమోషన్ దక్కింది. ఈ సినిమాపై బాలీవుడ్‌లోనూ మంచి అంచనాలు ఏర్పడటంతో... సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగింది. అయితే సినిమా రిజల్ట్ అనుకున్న విధంగా లేకపోవడంతో... సాహోపై ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అయితే సాహో రిజల్ట్... టాలీవుడ్ క్రేజీ హీరో రామ్ చరణ్‌ను కూడా డిజప్పాయింట్ చేసిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం సైరా సినిమాకు రామ్ చరణ్ నిర్మాత కావడమే.

సాహో సినిమా హిట్టయితే... అదే ఊపులో సైరాను కూడా బాలీవుడ్‌లో ప్రమోట్ చేయాలని నిర్మాత రామ్ చరణ్ అండ్ చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. అయితే సాహో రిజల్ట్ భిన్నంగా రావడంతో... సౌత్ నుంచి బాలీవుడ్ వెళుతున్న సైరాపై కూడా ఆ ప్రభావం ఉంటుందేమో అనే టెన్షన్ టాలీవుడ్ వర్గాల్లో కనిపిస్తోంది. ఈ కారణంగానే బాలీవుడ్‌లో సైరాను ప్రమోట్ చేసేందుకు రామ్ చరణ్ కొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. సైరాలో నటించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎలాగూ ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

అమితాబ్‌తో పాటు బాలీవుడ్‌లో తనకు సన్నిహితులైన సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ వంటి హీరోలతోనూ సైరా గురించి నాలుగు పాజిటివ్ కామెంట్స్ చేయించాలని రామ్ చరణ్ డిసైడయినట్టు సమాచారం. సల్మాన్, ఆమీర్‌తో పాటు తనకు క్లోజ్‌తో కొందరు బాలీవుడ్ యంగ్ హీరోలతోనూ సైరా గురించి కామెంట్స్ చేయించాలని చెర్రీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సాహో ఎఫెక్ట్ సైరాపై పడకుండా ఉండేందుకు రామ్ చరణ్ ఎలాంటి కేర్ తీసుకుంటారన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.First published: September 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు