రష్మిక మందన్నతో రొమాన్స్ చేయబోతున్న రామ్ చరణ్‌..

Ram Charan: చరణ్ ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఈయన గౌతమ్ తిన్ననూరి, కొత్త దర్శకుడు ప్రదీప్‌లలో ఒకరితో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 9, 2020, 6:54 PM IST
రష్మిక మందన్నతో రొమాన్స్ చేయబోతున్న రామ్ చరణ్‌..
రామ్ చరణ్‌తో రష్మిక మందన్న (ram charan rashmika)
  • Share this:
ఇన్ని రోజులు వేచి చూస్తున్న కాంబినేషన్ రానే వచ్చింది. రామ్ చరణ్, రష్మిక మందన్న జంటగా నటించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ హీరోను కవర్ చేసుకుంటూ వచ్చిన ఈమె ఇప్పుడు చరణ్‌తో కూడా రొమాన్స్ చేయబోతుందని ప్రచారం జరుగుతుంది. చరణ్ ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఈయన గౌతమ్ తిన్ననూరి, కొత్త దర్శకుడు ప్రదీప్‌లలో ఒకరితో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఇదిలా ఉంటే ఈ మధ్యలోనే మరో సినిమా చేయనున్నాడు చరణ్. అదే తన తండ్రి చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్.

చిరంజీవి కొరటాల సినిమా ఆచార్య (Chiranjeevi Look)
చిరంజీవి కొరటాల సినిమా ఆచార్య (Chiranjeevi Look)


కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం చరణ్‌ను అడిగితే వెంటనే ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్ర అని తెలుస్తుంది. బయటికి వచ్చిన ఫోటోలు చూస్తుంటే చిరు నక్సలైట్ అని అర్థమవుతుంది. ఇక ఈ చిత్రంలో చరణ్ నటించడం మాత్రం పక్కా అయిపోయింది. రాజమౌళి కూడా పర్మిషన్ ఇచ్చేసాడు. ముందు మహేష్ బాబును అనుకున్నా కూడా రెమ్యునరేషన్ మరీ ఎక్కువ అడిగాడని అతన్ని కాదని చరణ్‌ను తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌లో చరణ్ పాల్గొనబోతున్నాడు.

చిరంజీవి,కొరటాల శివ మూవీ ఓపెనింగ్ (Twitter/Photo)
చిరంజీవి,కొరటాల శివ మూవీ ఓపెనింగ్ (Twitter/Photo)


దాదాపు అరగంట పాటు ఇందులో చరణ్ పాత్ర ఉంటుందని.. కథను మలుపు తిప్పేలా ఉండబోయే ఈ పాత్ర కోసం చరణ్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించబోతుందని తెలుస్తుంది. ముందు ఈ పాత్ర కోసం కియారా అద్వానీతో సమంత, పూజా హెగ్డేను కూడా అడిగినా కూడా వాళ్లు ఆసక్తి చూపించకపోవడంతో రష్మిక మందన్నను తీసుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

‘సైరా’ షూటింగ్ స్పాట్‌లో రామ్ చరణ్,చిరంజీవి ( Twitter/Photo)
‘సైరా’ షూటింగ్ స్పాట్‌లో రామ్ చరణ్,చిరంజీవి ( Twitter/Photo)


ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం మాత్రం రెజీనాని తీసుకోవడం.. ఇప్పటికే ఆమెపై ఆ స్పెషల్ సాంగ్ చిత్రీకరించడం కూడా జరిగాయి. ఇప్పుడు చరణ్, రష్మిక అంటున్నారు.. ఏదేమైనా కూడా చాలా స్పెషల్స్‌తో చిరంజీవి ఆచార్య వచ్చేస్తుంది. 2021 సమ్మర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా చిరంజీవి సినిమాను నిర్మిస్తున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: April 9, 2020, 6:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading