బాలీవుడ్ హీరోయిన్‌తో రామ్ చరణ్ రొమాన్స్..

రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: November 25, 2019, 9:44 AM IST
బాలీవుడ్ హీరోయిన్‌తో రామ్ చరణ్ రొమాన్స్..
రామ్ చరణ్ (Twitter/photo)
  • Share this:
రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరికి జోడిగా హిందీ నటి అలియా భట్, బ్రిటీష్ నటి ఒలీవియా మోరిస్‌ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాలో ఏడు నుంచి ఎనిమిది పాటలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ్‌చరణ్‌, ఆలియాభట్‌ మధ్య ఓ రొమాంటిక్‌ పాటను దర్శకుడు రాజమౌళి చిత్రీకరించనున్నారట. అంతేకాదు ఆ పాట కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను కూడా వేస్తున్నారని, డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరంభీంగా కనిపించనున్నారు.

ఎర్ర చీరలో అదిరిన కాజల్ అగర్వాల్..

Published by: Suresh Rachamalla
First published: November 25, 2019, 9:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading